28
హైదరాబాద్మ : హారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) నాయకురాలు సుష్మా అంధారేకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్ప కూలింది.. ఈ ఘటనలో సుష్మా అంధారే, పైలట్ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, హెలికాప్టర్ ఎందుకు కూలి పోయిందన్న సమాచారం తెలియ రాలేదు. ఈ ఘటన రాయ్‌ఘడ్ లోని మహద్ ప్రాంతంలో జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది..