24
ముందుగా జిల్లాలోని సమస్యలపై అవగాహన పెంచుకుని.. అనంతరం వాటి పరిష్కారానికి చర్యలు చేపడతానని జిల్లా నూతన కలెక్టర్ డాక్టర్ జి. సృజన అన్నారు. కర్నూలు జిల్లా నూతన కలెక్టర్గా సృజన బాధ్యతలు చేపట్టారు. తాను ఎక్కువగా గుంటూరు, విజవాడ, విశాఖపట్నం ప్రాంతాలలో పనిచేశానని.. జిల్లాకు రావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాలు, రీసర్వేపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ఈ సందర్భంగా కలెక్టర్ తెలియజేశారు. ఈ ఇళ్ల నిర్మాణాలు పూర్తయితే.. గుడిసెలు లేని రాష్ట్రంగా ఎపి అవతరిస్తుందన్నారు. జిల్లాను అభివృద్ది పథంలో తీసుకురావడానికి తనవంతు కృషి చేస్తానన్నారు.