30
హైదరాబాద్ : మల్కాజిగిరి వసంతపురి కాలనీకి చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్తికి ఏకంగా రూ.1,75,173 కరెంటు బిల్లు వచ్చిందని వాపోయాడు. జీరో బిల్లు రావాల్సిన అతడికి రూ.లక్షల్లో బిల్లు రావడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. ఈ విషయమై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వెళితే వారు స్పందించడం లేదని బాధితుడు తెలిపాడు. అంతకుముందు రెండు నెలల్లో ఒకసారి రూ.600, మరోసారి రూ.1,438 బిల్లు వచ్చినట్లు తెలిపారు.