35
నేడు ఓరుగల్లుకు సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ : తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలో ప్రచార జోరు పెంచాయి. గడువు సమీపిస్తుండటంతో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రచారం ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో జరిగే రోడ్ షో, కార్నర్ మీటింగ్ లలో పాల్గొననున్నారు. ఇక రేపు పీఎం మోదీ ఖిలావరంగల్ మండలంలోని లక్ష్మీపురంలో జరిగే బీజేపీ భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు