Home తెలంగాణ ఓట్‌ ఫస్ట్‌….వర్క్‌ నెక్‌స్ట్‌’

ఓట్‌ ఫస్ట్‌….వర్క్‌ నెక్‌స్ట్‌’

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ఓటేయాలి: తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎం.డీ. సజ్జనార్‌..

0 comment

నేను మా కుటుంబసభ్యులు, మాపాపతో కలిసి ముగ్గురం వచ్చి ఓటు వేశామని సజ్జనార్ గుర్తు చేశారు.

హైదరాబాద్ :

ఓటు హక్కు ఉన్నవారంతా ‘ఓట్‌ ఫస్ట్‌…..వర్క్‌ నెక్‌స్ట్‌’ అనేది గుర్తించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.సి. సజ్జనార్‌ తెలిపారు. కొండాపూర్‌లోని చిరాక్‌ పబ్లిక్‌ స్కూల్‌ లోని 375 పోలింగ్‌ కేంద్రంలో తమ సతీమణి, కూతురుతో కలిసి వచ్చి ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ఓటేయాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఈరోజు చాలా ముఖ్యమైన రోజుఅని గుర్తించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఓటువేసి తమ దేశభక్తిని చాటుకోవాలన్నారు. నేను మా కుటుంబసభ్యులు, మాపాపతో కలిసి ముగ్గురం వచ్చి ఓటు వేశామని గుర్తు చేశారు. మీరు కూడా అంతా కుటుంబసభ్యులతో కలిసి వచ్చి ఓటేయాలన్నారు. ఎండ ఉందని వాయిదా వేయవద్దు. ముందు ఓటేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

1.50 కోట్ల మంది బస్సులో రెండురోజుల్లో స్వగ్రామాలకు తరలివెళ్ళారు.

ఆర్టీసీ ఎం.డీ వి.సి. సజ్జనార్‌…..

తెలంగాణ వ్యాప్తంగా గత రెండు రోజుల్లో 1.50 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి స్వగ్రామాలకు తరలివెళ్ళారని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.సి.సజ్జనార్‌ తెలిపారు. కొండాపూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 5వేల ఆర్టీసీ బస్సులను నడపడం జరిగిందన్నారు. ప్రస్తుతం వర్కింగ్‌ డేస్‌ కావడంతో వెళ్లిన వారంతా ఓటు వేసిన తర్వాత తిరిగి అదే రోజు వారంతా తిరుగు ప్రయాణంలో కూడా వారికి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామ న్నారు. నగరంలోని ఉప్పల్, ఎల్‌బీనగర్, ఆరంఘర్, సంతోష్‌నగర్, లింగంపల్లి ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఆయా ప్రాంతాలలో ప్రయాణికులకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేలా అన్ని టెంట్లు ఏర్పాటు చేసి వసతి కల్పించడం జరిగిందన్నారు గత రెండు రోజులుగా డ్రైవర్లు, కండక్టర్లు, ఆఫీసర్లు అంతా చాలా కష్టపడ్డారని, వారందరినీ యాజమాన్యం పక్షాన, సంస్థ పక్షాన అభినందించాల్సిన అవసరం ఉందన్నారు. చాలా ఒత్తిడి ఉన్నా వారంతా ప్రయాణికుల శ్రేయస్సు కోసం చేసిన సేవలు మరువలేనిదన్నారు.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4