30
హైదరాబాద్: త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి నల్లు గారు సోమవారం ఉదయం 7 గంటలకు. మలక్ పేట సలీం నగర్ పరిధిలోని జీహెచ్ఎంసి కమ్యూనిటీ హాల్ లోని పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. త్రిపుర ఫస్ట్ లేడీ రేణుకా నల్లు కూడా ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. ఓటు వేయడం హక్కు మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ దానిని బాధ్యతగా భావించి తప్పనిసరి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్ హితవు పలికారు.