Home ఆంధ్ర ప్రదేశ్ ఓటర్లకు బస్సు సౌకర్యం

ఓటర్లకు బస్సు సౌకర్యం

అదనంగా 2 వేల ఆర్టీసీ బస్సులు

0 comment

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 13న సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో ఓటర్లను స్వస్థలాలకు తీసుకువెళ్లడం మా భాద్యత అంటున్నాయ్‌ ఆర్టీసీలు. ఏపీలో ఓటున్న నగరవాసులు వెళ్లేందుకు సరిపడా బస్సులను నడిపేందుకు టీఎస్‌ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు రంగారెడ్డి రీజియన్‌ మేనేజర్‌ బి.రాజు తెలిపారు. ఈ నెల 9 నుంచే ఏపీకి రద్దీ ఉంటుందని, శని, ఆదివారాల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఆ రెండు రోజులు సెలవుదినాలు కావడంతో సిటీ బస్సులను దూర ప్రాంతాలకు వెళ్లేలా సర్దుబాటు చేస్తున్నామన్నారు. తెలంగాణలో పల్లెల్లో ఓట్లున్న వారు ఎన్నికల రోజు అక్కడికి వెళ్లేందుకు తెల్లవారుజాము నుంచి.. తిరిగి వచ్చేందుకు అర్ధరాత్రి వరకు బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని ఆర్‌.ఎం.రాజు తెలిపారు. ఇరు రాష్ట్రాల రవాణా సంస్థలు కలిపి రోజువారీ బస్సులకు అదనంగా 2 వేల వరకూ నడుపుతున్నామన్నారు. టీఎస్‌ఆర్టీసీతోపాటు ఈనెల 9 నుంచి 12 వరకు రోజూ నడిచే 352 బస్సులకు అదనంగా 500 బస్సులను నడుపుతున్నామని ఏపీఎస్‌ఆర్టీసీ డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ కిషోర్‌నాథ్‌ తెలిపారు. అదనపు బస్సుల్లోనూ రిజర్వేషన్‌ సౌకర్యం ఉంటుంది. టీఎస్‌ఆర్టీసీ రోజూ నడిచే 3,450 బస్సులకు అదనంగా 1000కిపైగా బస్సులను సిద్ధంగా ఉంచుతోంది. 200 బస్సుల్లో రిజర్వేషన్‌ సౌకర్యం కల్పిస్తున్నామని ప్రకటించింది.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4