25
iPhone: యాపిల్ సంస్థ ఐఫోన్ సిరీస్ పాత మోడళ్ల ధరలు తగ్గించింది. ఇటీవల ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను విడుదల చేసిన సంస్థ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఐఫోన్ 14, 14 ఫ్లస్, ఐఫోన్ 13 సిరీస్‌ల ధరలు యాపిల్ తగ్గించింది. ఈ మోడళ్లపై రూ. 10,000 తగ్గింపు లభిస్తోంది. ఐఫోన్ 14 ప్లస్ ఇపుడు 79,900, ఐఫోన్ 13 రూ. 59,900ల కొత్త ధరలతో వెబ్‌సైట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇంకా 128 జిబి బేస్ మోడల్ ఐఫోన్ 14 గతంలో రూ. 79,900 ఉండగా ప్రస్తుతం రూ. 69,900కే లభిస్తోంది.
అంతేకాకుండా పాత ఐఫోన్ విక్రయాలు నిలిపివేసింది. ఐఫోన్ 15 సిరీస్ అమ్మకాలు పెంచే నేపథ్యంలో సంస్థ పాత మోడళ్ల విక్రయాలను భారత్‌లో నిలిపివేసింది. ఐఫోన్ 12,.ఐఫోన్ 13 మిని, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రోమ్యాక్స్‌ను యాపిల్ ఇండియా వెబ్‌సైట్ నుండి తొలగించింది.