విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లకు ఎన్నికలకు సంబంధించిన అవగాహన కల్పించడానికి మరియు సమాచారాన్ని అందించడానికి తోడ్పడే వెబ్ సైట్ ను ఈనెల 5వ తేదీ విజయవాడలో ఎన్నికల నిఘా వేదిక ప్రారంభించింది. కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల అధికారుల, పరిశీలకుల ఫోన్ నెంబర్లు, ఇ మెయిల్, జిల్లా కలెక్టర్ల, జిల్లా ఎస్పీల మరియు నియోజక వర్గాల వారీగా నియమితులైన పరిశీలకుల వివరాలతో వెబ్ సైట్ ను రూపొందించామని ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదులను స్వీకరించడం మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘం రూపొందించిన సి విజిల్ ను వినియోగించుకోవాలని కోరారు. స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగడానికి ఎన్నికల నిఘా వెబ్ సైట్ తోడ్పడుతుందని తెలిపారు. www.apelectionwatch.comవెబ్ సైట్ లో ఎన్నికలకు సంబంధించిన సంపూర్ణ వివరాలను పొందుపరిచామని స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు జరగాలని భావించే రాజకీయ పార్టీలకు, పౌర సంస్థలకు ఈ వెబ్ సైట్ ఉపయోగకరంగా ఉంటుందని దీనిని వినియోగించుకోవాలని ఒక ప్రకటనలో డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల సమస్యలను, సంబంధిత ఎన్నికల అధికారి దృష్టికి తీసుకుని వెళ్లడానికి ఎన్నికల నిఘా వేదిక రూపొందించిన వెబ్ సైట్ తోడ్పడుతుందని వివరించారు.
31
previous post