31
టెంపరేచర్ రికార్డైంది
తెలంగాణ: రాష్ట్రంలో ఎండలు ఉగ్రరూపం దాల్చాయి. గురువారం ఏకంగా 8 జిల్లాల్లో 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ జిల్లా ఇబ్రహీంపేటలో అత్యధికంగా 46.6 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. ఎండ వేడికి తాళలేక గురువారం ఒక్కరోజే నలుగురు మృత్యువాత పడ్డారు. మెదక్ జిల్లాలో కుమ్మరి శాకయ్య, ఆసిఫాబాద్లో పోర్తెటి శ్రీనివాస్, కరీంనగర్లో గజ్జెల సంజీవ్, హనుమకొండలో అల్లె గోవర్ధన్ వడదెబ్బకు గురై ప్రాణాలు విడిచారు. ఇక శుక్రవారం సైతం “అంతకు మించి” అన్నట్టుగా భానుడు తన ఉగ్ర ప్రతాపాన్ని చూపుతున్నాడు..!