‘There is only one happiness in this life, to love and be loved’.ప్రేమ ఒకప్పుడు సేంద్రీయం (ఆర్గానిక్) ఆ ఆర్గానిక్ ప్రేమ మనకు ‘ఉత్సవ్’ లో దర్శనమిస్తుంది, నేడంతా నీరింద్రియమయం.మొదటిది సజీవంగా విశ్వజనీనమైనది, రెండవది ఆర్టిఫిషల్.ఉత్సవ్ లో ఓ రసతత్వాన్ని నేను దర్శించడం జరిగింది, స్రష్ట,సహృదయుడు అనే పదాలు రసతత్వానికి ప్రధాన భూమికలు, సృష్టించినవాడు స్రష్ట అవుతాడు.ఆ సృష్టించిన బడిన వాటిని రసాస్వాధన చేసే వ్యక్తి సహృదయుడు అవుతాడు.ఉత్సవ్ ను తీర్చిదిద్దిన తీరులో ఎయే మనోవైజ్ఞానిక ఉత్తేజములు దర్శకుడిని ఆవాహన చేసుకున్నాయి,అన్నది సినిమాలో స్పష్టంగా గోచరిస్తాయి. ప్రేమ అనేది మరొక వ్యక్తి కొరకు సున్నితంగా పదిల పరచుకొనే ఒక లోతైన, అవ్యక్తభావన.ప్రేమ యొక్క ఈ చిన్ని భావన కూడా, అనేక రకాల భావాల నిధిలోకే చేరుతుంది, తపనతో కూడిన కోరిక మరియు శృంగారభరిత ప్రేమ నుండి సెక్స్ తో సంబంధంలేని ఉద్వేగభరిత దగ్గరితనం ప్లేటోనిక్ ప్రేమ. ఆదిమానవుడు నుంచి మనిషిగా మారిన పరిణామ క్రమంలో సంభవించిన ఓ మహోన్నతమైన అద్వితీయమైన అలోక్యమైన భావన ప్రేమ, మానవ జీవన వికాసంలో ప్రేమ ఓ మధురమయిన భావన.అది నాగరికత విలసిల్లడానికి మనిషిని ఋషిని చేసిన ఓ అద్వితీయ అనుభూతి. స్త్రీ పురుషుల మధ్య, ప్రేమ తరతరాల జీవన వాహిని కి నాంది ,ప్రస్తావనంగా నిలిచిపోయింది.స్నేహం, ప్రేమ, సెక్స్ అత్యంత స్వాభావిక మయినవి, అలాంటి అపురూపమైన భావాలని తెరపై అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన చిత్రరాజం ఉత్సవ్.ఆనాటి, సమకాలిన సమాజాన్ని దర్శకుడు గిరీష్ కర్నాడ్ సృజించిన తీరు వేనోల్లు కొనియాడ దగినది.4 వ శతాభ్దంలో” శూద్రకుడు”…. రాసిన నవల “….మ్రుచ్చకటికం”.. ఈ సినిమాకి ఆధారం.1984 లో రిలీజ్ అయి ఇప్పటికి ప్రేక్షకుల నోస్తాలజిక్ మూమెంట్ గా నిలిచిపోయింది..మానవ జీవన నేపథ్యానికి ఆపాదమస్తకమైన అనుభంధాలను జోడించి,విస్త్రుత అంశాలని క్రోడీకరించి ప్రేక్షకుల మానసిక స్థాయిని పెంచిన సినిమా.స్త్రీ ,పురుష సంభంధాలకి దైవాంశను అద్ది,లోకకల్యాణంకోసం చేసే పండుగ అని చెప్పిన సినిమా.అనేక కోనాల్లో అనేక రూపాల్లో ప్రేమని, ఆకర్షణని,పెనవేసి తెరపై మైమరిపించిన నిజాయితీ గల కళాసృష్టి. ప్రేమ మరియు సంభోగం గురించే కాకుండా వేశ్య పాత్రను సృజించిన తీరు ఉన్నతమైనది. ఆనాటి సమాజంలోని మేధో పరిపక్వతని ‘ఉత్సవ్’ వాస్తవికంగా చిత్రించింది. వసంతసేనగా,’ రేఖ’ అందాలని ఆరబోసింది,సంస్థానకుని పాత్ర “అమితాబ్ బచ్చన్ ” పోషించాల్సి ఉండింది,బెంగళూరు లో ఆయనకు ఆక్సిడెంట్ కావడం వల్ల సినిమా ప్రొడ్యూసర్ ‘శశికపూర్’ స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. చాయా చిత్రకారుడు ‘అశోక్ మెహతా’ ప్రతిభ అనన్య సామాన్యం.ఆర్డ్ డైరెక్టర్లు ‘నచికేత్ ఆండ్ జయూ పట్వర్ధన్’ల ద్వయం పనితనం చూసి తీరాల్సిందే. ఆ కాలం నాటి కట్టడాల్ని, వీధుల్ని కళ్ళకి కట్టినట్టు చూపించిన రససంయోజనాత్మకమైన మేధో ప్రతిభ ప్రశంసనీయమైంది.’చారుదత్’ గా ‘శేఖర్ సుమన్’, వాత్సాయనుడిగా ‘అంజాద్ ఖాన్’ పాత్రలు పరకాయ ప్రవేశం చేసాయని చెప్పవచ్చు.లక్ష్మీకాంత్ ప్యారేలాల్ నేపథ్య సంగీతం,అషాబోస్లె,లతా మంగేష్కర్,అనురాధ పౌద్వాల్ వినసొంపైన గానం ప్రేక్షకులని ముఘ్ధుల్ని చేస్తుంది.ఆనాటి సమాజ స్థితిగతులని అధ్బుతంగా ఆవిష్కరించిన తీరును అభినందిస్తూ మరోసారి వీలైతే చూద్దాం.By Prakash Surya.
55