Home ప్రత్యేకం ఉగాది ప‌చ్చ‌డిలో.. అద్భుత ఔష‌ధ‌ గుణాలు!

ఉగాది ప‌చ్చ‌డిలో.. అద్భుత ఔష‌ధ‌ గుణాలు!

by live
0 comment

వసంత ఋతువు ఋతువులలో రారాజులాంటి ఋతువు. వ‌సంత ఋతువులో ప్రకృతి ప్ర‌తి రోజు కొత్త రమణీయత, సంతరించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు వసంత సిరి యవ్వనంతో ఉంది. వనాలు, ఉపవనాలు, నగరాలు, గ్రామాలు, సర్వత్రా నయనానందకరంగా మారి మనసును ఆహ్లాదంతో ముంచేస్తాయి. చరాచర జగతంతా ఆనందంతో ప్రపుల్లితమై కొత్త రూపం దరిస్తుంది. వనాల్లో, ఉద్యాన వనాల్లో నవవికసిత కుసుమాలు కను విందు చేస్తాయి.

వసంత ఋతువుకు చాలా ప్రాధాన్యత ఉన్నది. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కోయిలలు కుహు.. కుహు.. ధ్వనులతో, పక్షుల కీలకీలతో, మధురమైన జుoకారములతో, మల్లెపూల గుబాళింపులతో, మావిచిగురులతో మధురాతి మధురంగా పరవసిస్తుంది. ఉగాది ఎప్పుడు వస్తుందో అప్పుడే తెలుగు వారికి కొత్త సంవత్సారాథి వచ్చినట్లు.

ఉగాది పచ్చడి గురించి చెప్పుకుందాం…

భారతదేశంలో అనేక ప్రాంతాలలో ఉగాది ని చేసుకుంటారు. ఇప్పుడు ఇతర దేశాలలో ఉన్న మన భారతీయులతో పాటు విదేశీయులు కూడా మనతో ఉగాది పండుగ చేసుకుంటున్నారు. కొంత మంది దేవి నవరాత్రులు ఉత్సవాలు ఈ రోజు నుండే ప్రారంభిస్తుంటారు.

ఋతువులతో కూడిన తొలి దినమే ఉగాది. కొన్ని ప్రాంతాలలో ఇంటికి పంట చేరుకుంటుంది. జేబు నిండా, చేతులలో డబ్బులు గలగల అంటూ చేతి నిండా డబ్బులు వుంటాయి. భలే ఖుషీగా, ఆనందంగా, హుషారుగా వుంటారు. పండుగ రోజు తెల్లవారుజామున లేచి, చక్కగా తల స్నానాలు చేసుకొని, కొత్త బట్టలు కట్టుకొని. ఇళ్లకు మామిడి పచ్చని తోరణాలు కట్టి, మొత్తకు, సింహ ద్వారానికి పసుపు పెట్టి, ఇళ్లను చక్కగా అలంకరించుకొవటం హిందు సాంప్రదాయం, సంస్కృతికి, చాలా మంచి ఆచారం. ఇంటిని చక్కగా చేసుకున్న తరువాత ఇలవేల్పులను పూజించటం, ధూప దీప నైవేద్యాలను సమర్పించుకొని తరువాత క్రొత్త కుండలో కొత్త చింతపండు, వేపపూవు, బెల్లం, మామిడి ముక్కలు, అరటిపండు, చేరుకు ముక్కలు, చిటికెడు ఉప్పు, మొదలగున్నవి కలిపి ఉగాది పచ్చడి చేసి దేవుడికి అర్పించి తరువాత కుటుంబం అందరూ కలిసి ఆనందంగా ఆ రసాన్ని అస్వాదిస్తారు. ఉగాది పచ్చడి ఎంతో చెప్పలేని రుచిగా ఉంటుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. రాబోయే రోజులలో శరీరానికి, మానసికంగా జబ్బులు రాకుండా ఈ పచ్చడిలో ఉన్న ఆరు రుచులతో ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆరోగ్యాన్ని అందించటంలో అద్వితీయమైన పాత్ర పోషిస్తుంది. ఉగాది పచ్చడిలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4