38
ఎండ వేడి, ఉక్కపోతతో అల్లాడిపోతున్న దేశ ప్రజలకు భారత వాతావరణశాఖ చల్లటి కబురు అందించింది. పశ్చిమ రాజస్థాన్, కేరళ మినహా దేశంలోని మిగతా ప్రాంతాల్లో ఈ ఏడాది వడగాల్పులు వీచే అవకాశం లేదని పేర్కొంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు చల్లబడటం వల్ల అటు నుంచి వస్తున్న గాలులతో దేశంలో వడగాల్పుల తీవ్రత తగ్గుతోందని వెల్లడించింది. పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు పెరిగే అవకాశం ఉందని వివరించింది.