Home ఒక్క‌మాట‌ ఆరోగ్యంగా మిగిలిన జీవితం గడపాలి

ఆరోగ్యంగా మిగిలిన జీవితం గడపాలి

అందుకే హోంకు వెళ్లిపోతోంది : ఓ సీనియర్ సిటిజెన్స్

0 comment

ఆమె వయస్సు 65 ఏళ్లు…మదనపల్లె నుంచి బెంగుళూర్ కు వెళ్లిపోతోంది. అక్కడ  ఓ సీనియర్ సిటిజెన్స్ హోమ్‌కు..అనగా ఓ ప్రత్యేక వృద్ధాశ్రమానికి…

ఆమె భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు.  ఆమె చదువుకున్నదే…ముగ్గురు పిల్లల పెళ్లిళ్లు చేసింది. వాళ్లందరూ అమెరికా పౌరులు. అందరికీ ఇద్దరేసి పిల్లలు…వాళ్లంతా హైస్కూల్, కాలేజీ చదువుల్లో ఉన్నారు ఈమె అమెరికాకు బోలెడుసార్లు వెళ్లింది. కాన్పులు చేసింది.  వెళ్లిన ప్రతిసారీ ఆరు నెలలపాటు ఉండేది.  ఇక చాలు అనుకుంది.
ఇక తన అవసరం ఎవరికీ ఏమీ లేదు. అమెరికాకు వెళ్లాలని లేదు, రానని చెప్పేసింది.  ఆరోగ్యంగా మిగిలిన జీవితం గడపాలి చాలు..అందుకే ఆమె సీనియర్ సిటిజెన్స్ హోంకు వెళ్లిపోతోంది. వాటినే రిటైర్‌మెంట్ హోమ్స్ అనండి… అమెరికాలో వాటినే నర్సింగ్ హోమ్స్ అంటారు.

ఆమె ఏమంటున్నదో చదువండి..

‘వెళ్తున్నాను… ఇక తిరిగి ఎక్కడికీ రాను…నా విశ్రాంత, చివరి కాలం గడపటానికి ఓ స్థలం వెతుక్కున్నాను. వెళ్లకతప్పదు…
తమ పిల్లల బాగోగుల గురించి నా పిల్లలు బిజీ…ఎప్పుడో గానీ నేను వారి మాటల్లోకి రాను. నేనిప్పుడు ..ఎవరికీ ఏమీ కాను..ఎవరికీ అక్కరలేదు…ఆశ్రమం అంటే ఆశ్రమం ఏమీ కాదు…అది రిటైర్‌మెంట్ హోం… బాగానే ఉంది…ఒక్కొక్కరికీ ఒక సింగిల్ రూం…
మరీ అవసరమైన ఎలక్ట్రికల్ పరికరాలు…టీవీ… అటాచ్డ్ బాత్రూం… బెడ్డు…ఏసీ కూడా ఉంది…కిటికీ తెరిస్తే బయటి గాలి…
ఫుడ్డు కూడా బాగుంది. సర్వీస్ బాగుంది…కానీ ఇవేమీ చవుక కాదు. ప్రియమైనవే…నాకొచ్చే పెన్షన్ బొటాబొటీగా ఈ అవసరాలకు సరిపోతుంది.

సరిపోదంటే నాకున్న సొంత ఇంటిని అమ్మేయాల్సిందే…అమ్మేస్తే ఇక చివరి రోజులకు సరిపడా డబ్బుకు ఢోకాలేదు…నా తరువాత ఏమైనా మిగిలితే నా కొడుక్కి వెళ్లిపోతుంది…సో, ఆ చీకూచింత ఏమీ లేదు…‘నీ ఇష్టం అమ్మా, నీ ఆస్తిని నీ అవసరాలకే వాడుకో…’ అన్నాడు నా వారసుడు…వెళ్లిపోవడానికి సిద్ధమైపోతున్నాను…ఓ ఇంటిని వదిలేయడం అంటే అంత సులభమా..?కాదుగా..ఐడీ కార్డు, సీనియర్ సిటెజెన్ సర్టిఫికెట్, హెల్త్ ఇన్స్యూరెన్స్ కార్డ్, ఏటీఎం కార్డు, బ్యాంకు పాస్ బుక్కు చాలు.
అన్నీ వదిలేశాను…బంధం తెంచేసుకున్నాను. నా పొరుగువారికి వీడ్కోలు చెప్పాను. డోర్ వేసి, గడపకు మూడుసార్లు వంగి మొక్కుకున్నాను. ఈ ప్రపంచానికి అన్నీ వదిలేశాను.

– సబితా రాజు.డి

 

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4