Home ఆంధ్ర ప్రదేశ్ అరుదైన మానవీయ ప్రాజెక్ట్‌

అరుదైన మానవీయ ప్రాజెక్ట్‌

రూ. 700 కోట్లతో సుజల ధార!

0 comment

విజయవాడ :  ఆరేళ్ల క్రితం ఇక్కడకు వచ్చినపుడు నిండు కుండ లాంటి వంశధార రిజర్వాయర్‌ తప్ప ఏమీలేదు. ఇపుడు.. ఇక్కడ రెండు భారీ మోటార్లు తో నీటిని పంపింగ్‌ చేసి, 32కిలోమీటర్ల దూరంలోని మిలియపుట్టి వద్దకు గ్రావిటీ ద్వారా పంపి, శాండ్‌ ఫిల్టరేషన్‌ చేసి అక్కడి నుండి 100కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉద్దానం ప్రాంతంలో, కొన్ని దశాబ్దాలుగా స్వచ్ఛ మైన తాగు నీరు ఎలా ఉంటుందో తెలీని జనానికి నీళ్లను పంపుతున్నారు. 800 గ్రామాల్లో పైప్ లైన్ పనులు పూర్తి అయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో రూ. 700 కోట్లతో హిమాచలం పప్ప హౌస్ ను నిర్మించారు.  ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పుడు కానీ , పూర్తి అయినప్పుడు ఎక్కడా చప్పుడు లేదు. పల్లెల్లో నీళ్లు పట్టుకుంటున్న ప్రజల గుండె చప్పుడు తప్ప. గ్రామీణ జర్నలిస్ట్‌గా నన్ను కదిలించిన అరుదైన మానవీయ ప్రాజెక్ట్‌ సుజల ధార!
– శ్యాంమోహన్

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4