ఈసారి ఏపీ లో పోలింగ్ బూతులు జాతరల్లా కనిపించాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యధిక శాతం నమోదయినట్టు ఈసీ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజకీయ చైతన్యానికి సూచిక.కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా వచ్చి 6 లోపు లైన్లల్లో ఉన్నవారికి ఓటు హక్కు అవకాశన్ని కలిపించారు.దీంతో అర్థరాత్రి 2గంటల వరకు పోలింగ్ జరిగింది.పవన్ కళ్యాణ్ ప్రాతినిత్యం వహిస్తున్న పిఠాపురం లో ఎక్కడ లేని విధంగా పోలింగ్ ప్రక్రియ జరిగింది. ఈసారి 86.63 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది, అసలు అధిక పోలింగ్ శాతం దేనికి సూచన అన్నది ఓ మిలియన్ డాలర్ ప్రశ్న? అటు అధికార పార్టీ నుంచి ఇటు కూటమి నుంచి పోటీచేసిన అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి!! ఎవరి లెక్కలు వారివే !! అసలు లెక్కలు తేలేది జూన్ 4వ తేదీనే.ఆ లెక్కలన్నీ ఈవీఎం బాక్సుల్లో భద్రంగా ఉన్నాయి.
54
previous post