22
హైదరాబాద్: ఇటీవల విడుదలైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)లో ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో మూడో ర్యాంక్ సాధించిన అనన్య రెడ్డి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె పేరుతో ఇన్స్టాగ్రామ్, ఎక్స్, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలలో నకిలీ ఖాతాలను తెరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయా మాధ్యమాల ద్వారా సివిల్స్ ఆశావహులకు తాను మెంటార్షిప్ చేస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తన పేరుతో సైబర్ నిందితులు డబ్బులు కూడా వసూలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజా యూపీఎస్సీ ఫలితాలలో మహబూబ్‌నగర్‌కు చెందిన దోనూరు అనన్య రెడ్డి మూడో ర్యాంకు సాధించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.