సరూర్ నగర్ లో రేవంత్ రెడ్డి సీఎం.
పేద ప్రజల కోసం రాహుల్ గాంధీ జీవితాన్ని అంకితం చేశారు.
మన రాష్ట్రం లో 14 పార్లమెంట్ స్థానాలు గెలిపించి ఇండియా కూటమి నీ గెలిపించాలి..
ఈ ఎన్నికలు మనకు జీవన్మరణ సమస్య..
ఇప్పుడు
రాజ్యాంగం ప్రమాదం లో పడింది.రాజ్యాంగం నీ
రక్షించాలి అంటే కాంగ్రెస్ ను గెలిపించాలి..
గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బడుగు,బలహీనవర్గాలకు ఇచ్చిన రిజర్వేషన్ల పై మోడీ కండ్లు పడ్డాయి..
రాజ్యాంగం నీ కాపాడడం కోసం రిజర్వేషన్లు అమలు కావాలంటే ఇండియా కూటమి అధికారంలోకి రావాలి.
ఆంధ్రలో అధికారం కోల్పోయిన దేశం లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది..
నిన్న బీజేపీ సభ్యురాలు మాట్లాడుతూ 15 సెకన్లు సమయం ఇస్తే మైనార్టీ లను తుద ముట్టిస్తామని చెప్పింది…ఆలోచించండి మిత్రులారా.
విశ్వ నగరంలో బీజేపీ వాళ్ళు విషం చిమ్ముతున్నారు.
మనం అన్ని పండుగలు చేస్తున్నాము.హిందూత్వ ము గురించి బీజేపీ వాళ్ళు నేర్పాలా..
జనాలను రెచ్చే గొట్టే విధంగా మాట్లాడిన బీజేపీ మహిళ నేత మీద కేస్ లు పెట్టాలి…ఆమెను అరెస్ట్ చేయాలి.
బీజేపీ మహిళ నాయకురాలు మాట్లాడిన మాటలు బీజేపీ నాయకులు సమర్థించకపోతే బీజేపీ పార్టీ నుండి మహిళ నేతను బహిష్కరణ చేయాలి..