Home Uncategorized వార‌ఫ‌లాలు (జూలై 25-31)

వార‌ఫ‌లాలు (జూలై 25-31)

by live
0 comment

మేష రాశి
అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి

ఈ వారం ఆశ్చర్యకరమైన రీతిలో పనులు చక్కదిద్దుతారు. మీ వ్యూహాలు, ఆలోచనలు కలసివస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులు తోడుగా నిలుస్తారు. ఆర్థిక పరిస్థితి అన్ని విధాలా అనుకూలించి అవసరాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరించి ముందుకు సాగుతారు. వ్యాపారాలు హెచ్చుతగ్గులు ఉన్నా మొత్తానికి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలమవుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. స్వల్ప అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, శుభం కలుగుతుంది.

వృషభరాశి
కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి

ఈ వారం వ్యతిరేక పరిస్థితులను సైతం అనుకూలమైనరీతిలో మలచుకుంటారు. మిత్రులతో విభేదాలు పరిష్కరించుకుని సంతోషంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగుపడి ఊరట లభిస్తుంది. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కొన్ని సమస్యలను ఎదుర్కొంటూనే చాకచక్యంగా వ్యవహరిస్తారు. శుభకార్యాల నిర్వహణపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు మునుపటి కంటే అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలు వివాదాల నుంచి బయటపడతారు. వారం చివరిలో ఆరోగ్యసమస్యలు. ధనవ్యయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. శుభం కలుగుతుంది.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4