Home ఆంధ్ర ప్రదేశ్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేయించగలరా?

ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేయించగలరా?

మోడీకి, బాబుకి మాజీ మంత్రి వడ్డే సవాల్

0 comment

మాజీ మంత్రి, ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాద్ధీశ్వర రావు

విజయవాడ:- వైసీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని ప్రధానమంత్రి మోడీకి చెప్పి రద్దు చేయించగలరా? అని మాజీ మంత్రి, ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాద్ధీశ్వర రావు టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడుకి సవాల్ విసిరారు. బుధవారం ప్రధానమంత్రి మోడీ విజయవాడ రానున్న సందర్భంగా జరిగే బహిరంగ సభలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేయించే హామీ ఇవ్వగలరా? అని వడ్డే శోభనాద్ధీశ్వరరావు ప్రశ్నించారు. ఈ యాక్ట్ ను అమలు చేయమని సిఫార్చేసింది బిజెపి కేంద్రప్రభుత్వం నేతృత్వంలోని నీతి ఆయోగ్ రూపకల్పన కాదా అని విమర్శించారు. నేడు విమర్శిస్తున్న టిడిపి అసెంబ్లీలో వారి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఈ యాక్ట్ సరైనదని మద్దతు పలకలేదా అని గుర్తు చేశారు. లోపల మద్దతు పలుకుతూ, పైకి మాటల గాంభీర్యం ప్రకటిస్తున్నారని టిడిపిని విమర్శించారు. ఈటీవీ, అన్నదాతల్లో యాక్ట్ అనుకూల కథనాలు కూడా ప్రచారం అయ్యాయని గుర్తు చేశారు. ఎప్పటికైనా ఈ యాక్ట్ ను ప్రశ్నించాలని, నిలధీయాలని, రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వాన్ని బాబు ప్రశ్నించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో బిజెపి కేంద్ర ప్రభుత్వానికి టిడిపి పొత్తుగా మారిందని ఎద్దేవా చేశారు. టిడిపి హయాంలో వచ్చిన భూసేకరణ సవరణ చట్టం ప్రకారం వైసీపీ ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల పేరుతో అక్రమాలకు పాల్పడిందని, ఈ అవకాశం టిడిపి ఇచ్చిందని గుర్తించుకోవాలన్నారు. బుధవారం విజయవాడలో జరిగే ప్రధానమంత్రి రోడ్డు షో లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేయిస్తామని ప్రకటించగలరా అని టిడిపిని మరోసారి సవాల్ చేశారు. ప్రత్యేక హోదా కోసం హామీని, విభజన చట్టాల హామీలు నిలబెట్టగలుగుతారా అని ప్రశ్నించారు. 14వ కమిషన్ ఇవ్వద్దని చెప్పిందని ప్రధానమంత్రి అంటున్నారని వాస్తవానికి ఏపీకి బిజెపి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వటానికి వ్యతిరేకమని నిలదీశారు. బిజెపి ఆంధ్ర రాష్ట్ర హామీలన్నిటికీ తిలోదకాలు ఇచ్చిందని, బిజెపి ప్రభుత్వం ఆంధ్రులకు చెవుల్లో తామర పువ్వులు పెట్టొద్దని ఏద్ధేవా చేశారు. గత ఎన్నికల్లో సంవత్సరానికి కోటి ఉద్యోగాల హామీ ఏమైందన్నారు. కొత్త ఉద్యోగాలు ఒక్కటి ఇవ్వలేదన్నారు. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టారన్నారు. అయినా 30 లక్షల కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయగలరా అని నిలదీశారు. విదేశీనల్లధనం ఏమైందన్నారు. ఏడాది పాటు రైతు ఉద్యమం సాగితే రైతు సమస్యలపై సంఘీభావం ప్రకటించిన టిడిపి బిజెపీకి మద్దతు ప్రకటించడం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. టిడిపి పార్టీ ఈ ఎన్నికల్లో పార్టీ వ్యవస్థాపకులు, కీర్తిశేషులు నందమూరి తారకరామారావు ఆలోచనలకు భిన్నంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ వాగ్దానాలన్నీ అసత్యాలని మండిపడ్డారు. బిజెపి మేనిఫెస్టోలో ఒక్క అంశం కూడా రైతుల డిమాండ్ లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, విద్యుత్తు సవర్ణ చట్టాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా బిజెపికి మద్దతు ఇచ్చే పార్టీలను ఓడించాలన్నారు. ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ప్రముఖ ఇంజనీరు కె.విజయ రావు, రిటైర్డ్ ఐఏఎస్ బి. శ్రీనివాస్ రావు, ఏపి రైతు సంఘాల రాష్ట్ర నాయకులు వై. కేశవరావు, చుండూరు రంగారావు, ఎలమందరావు, తోట ఆంజనేయులు, వీరబాబు, హరిబాబు, మరీదు ప్రసాద్ బాబు పాల్గొన్నారు. తొలుత ఏపి రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశం జరిగింది. ఇండియా కూటమి అభ్యర్ధులను గెలపించాలని సమావేశం తీర్మానించింది.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4