25
హైదరాబాద్ (NEWS): అధికారంలో ఉన్నపుడు ఏనాడూ పంట పొలాలు సందర్శించని బిఆర్ ఎస్ నాయకులు ఇపుడు రైతులపై ప్రేమ కురిపిస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మంత్రి తుమ్మల ఆరోపించారు. బిఆర్ ఎస్ నాయకుల అనాలోచిత చర్యలతో రాష్ట్ర ఆర్ధిక పరిస్తితి పూర్తిగా దిగజారినప్పటికీ రైతుల శ్రేయస్సుకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. రూ.2లక్షల రుణమాఫీకి సంబంధించి విధివిధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు. శుక్రవారం రైతుబంధు నిధులు 64,75,819 మంది రైతులకు విడుదల చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయ పురోగతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రుణమాఫీ అమలు చేయడానికి ఆర్‌బిఐ, బ్యాంకులతో కలిసి విధివిధానాల రూపకల్పన చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.