మేడ్చల్ జిల్లా; దేశంలో బీజేపి మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు, బీజేపి జాతీయ నేత టీ. లక్ష్మణ్ త్రీవంగా ధ్వజమెత్తారు. ఆదివారం సికింద్రబాద్ పోలీసు పరేడ్ గ్రౌండ్లో జరిగిన మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపి ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నెహ్రూ నుంచి ఇప్పటి వరకూ ఎవ్వరూ చేయలేని పని..పార్లమెంట్ భవన్ లో రాజ్యాంగ సృష్టి కర్త బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రధాని మోదీ ప్రతిష్టించారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు ఆరోపణలు,ప్రచారాన్ని తిప్పికొట్టటం ద్వారా బీజేపి దేశంలో 400 సీట్లు గెలువబోతోందన్నారు. మూడో సారి మళ్లీ మోదీ ప్రధాని ని చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.సభలో మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపి అభ్యర్ధి ఈటల రాజేందర్ మాట్లాడుతూ దేశం సుభిక్షంగా ఉండాలంటే.. మోదీ మూడో సారి ప్రధాని నీ చేయాలని ప్రజలను కోరారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామని కాంగ్రెస్ చెప్పుతున్న మాటలన్నీ భూటలం అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో రిజర్వేషన్లు ఏమైనా రద్దు అయ్యాయని ఆయన ప్రశ్నించారు. సభలో కంటోన్ మెంట్ అభ్యర్థి వంశీ, బీజేపి రాష్ట్ర,జిల్లా నేతలు రామచంద్రరావు, ప్రభాకర్ ,సుభాష్ రెడ్డి, మల్లారెడ్డి , కాసం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
మల్కాజిగిరిలో బీజేపీ గెలుపు ధీమా .
మల్కాజిగిరిలో పార్టీ అభ్యర్థి, సీనియర్ నేత ఈటల రాజేందర్ గెలుపును ప్రతిస్థాత్మకంగా తీసుకున్న బీజేపీ ఆదివారం పోలీసు పరేడ్ గ్రౌండ్లో కేంద్ర మంత్రి అమిత్ షా తో ఎన్నికల బహిరంగ సభ నిర్వహించింది. అలాగే ఎన్నికల ప్రచారాన్ని కూడా హోరాహోరీగా నిర్వహిస్తోంది. అభ్యర్థి ఖరారు నుంచి మొదలుకొని .. నామినేషన్ల దాఖలు.. ఎన్నికల సభలు, ప్రచారంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజిగిరిలో ప్రధాని మోదీ రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని రోడ్ షో విజయవంతం కావటంతో .. మల్కాజిగిరి లో గెలుపు ధీమాతో ఉన్నబీజేపి మరింత దూకుడు పెంచింది. అందులో భాగంగానే బీజేపి ఆదివారం నియోజకవర్గం పరిధిలోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో కేంద్ర మంత్రి అమిత్ షా తో ఎన్నికల బహిరంగ సభ నిర్వహించి.. పార్టీ నాయకులతో పాటు కేడర్లో ఎన్నికల ప్రచార జోష్ నింపింది. తద్వారా మల్కాజిగిరి లో బీజేపీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు చెప్పకనే చెప్పింది. మల్కాజిగిరి ఎన్నికల ప్రచారంలో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొనటంతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టరు టి. లక్ష్మణ్, స్థానిక నాయకుల భాగస్వామ్యం కార్యకర్తల్లో ఊపును నింపింది.