66
మోడీకి కౌంటర్ ఇచ్చిన బొత్స..
బీజేపీ ఏపీలో రాదు.. బంగాళాఖాతంలో వస్తుందని విమర్శించారు. మోడీ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివాడని.. రైల్వే జోన్ పై మోడీ అవగాహన లేకుండా మాట్లాడారని ఆరోపించారు.
బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకడు తానా అంటే.. ఇంకొకడు తందనా అంటున్నారని దుయ్యబట్టారు.
మోడీకి స్థానిక సమస్యలు అవసరం లేదు.. అందుకే స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడకుండా వెళ్ళిపోయాడని మంత్రి పేర్కొన్నారు.ఇప్పుడు బీజేపీ చేస్తున్న అవినీతి.. దేశ చరిత్రలో ఏ పార్టీ చేయలేదని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
తన రాజకీయ జీవితంలో బీజేపీ అంత అవినీతి పార్టీని ఎప్పుడూ చూడలేదని తెలిపారు. మోడీ ప్రధాని పదవికి విలువ లేకుండా చేస్తున్నారని.. మోడీ అంత దిగజారే ప్రధానిని ఎప్పుడూ చూడలేదని తీవ్ర ఆరోపణలు చేశారు.