Home ఆంధ్ర ప్రదేశ్ మారుతున్న ఓట్ల పండగ

మారుతున్న ఓట్ల పండగ

5ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ రోజున పండుగలా జరుపుకోండి.

0 comment

పొద్దున్నే స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని పోయి ఓటు వేసి రండి.

గుండె,  ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి

కర్నూలు :

ఉదయం లేచి వాకింగ్ కని బయలుదేరాను.. బయటకు వచ్చి చూస్తే కర్నూలులో వర్షం దంచి కొడుతుంది.. ఇక చేసేదేమీ లేక మరలా డ్రెస్సు తీసేసి స్నానం చేసేసాను.. గ్రీన్ టీ తాగుతూ ఓట్ల పండక్కి వెళ్లాలని అనుకుంటా ఉంటే ఇక నా జీవితం కళ్ళ ముందు కదలాడింది..

నా చిన్నప్పుడు జనతా పార్టీ అని అప్పుడే వచ్చింది.. ఆ కాలంలో పెద్ద ఊరేగింపు ఎద్దుల బండ్లతో చేశారు మేము చిన్న పిల్లలం.. గుర్తుకే ఓటేయాలి అని రోజంతా అరుస్తూ ఆ బండిలో తిరుగుతూనే ఉన్నాం.. తర్వాత కొన్నాళ్లకు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చాయి అందులో టింగ్ టింగ్ పంచడం నాకు గుర్తుంది..

తర్వాత ఒకరి ఓటు ఒకరు వేస్తారని దాని దొంగ ఓటు అంటారని తెలుసుకున్నాను.. తర్వాత పోలింగ్ రోజు గొడవలు జరగడం, బాలెట్ బాక్సులలో ఇంకుపోయడం ఆ కాలంలో ఉండేటివి.. అప్పుడు అక్కడ రీపోలింగ్ జరిగింది..

తరువాత ఒక బూతులు ఆ పల్లెలో ఆక్రమించుకొని ఎవరికి వాళ్లు ఓట్లు గుద్దుకునేవారు.. దీనిని బూత్ క్యాప్చరింగ్ అని అనేవాళ్ళు ఇది కాలక్రమేణా అంతరించిపోయింది… తరువాత కాలంలో సైక్లింగ్ అనే ఓ పద్ధతిని ప్రవేశపెట్టారు ఇందులో ఒక ఊరిలో ఓటు వేసిన వాళ్ళు వేరే ఊరిలో వచ్చి వరుస సంఖ్యలో నిలబడి అక్కడ ఉన్న ఓట్లన్నీ వేస్తారు దీనిని సైక్లింగ్ అని అనేవారు.. వీళ్ళు మరలా ఇంకో బూతుకు వెళ్తారు..

అప్పుడు ప్రచారం అంటే పాంప్లెట్లు వేయడం గోడల మీద రాయడం ఉండేది.. ఇంటికి సున్నం వేసిన గోడలన్నీ గబ్బు పట్టి పోయేవి.. తర్వాత వచ్చిన శేషన్ ఎలక్షన్ కమిషనర్ దానిని ఆపేశాడు.. పేరడీ పాటలు రాయడం వాటిని రికార్డుల ద్వారా ప్రజలకు చేరవేయడం అనేది ఆ కాలంలో కూడా ఉండేది…

తర్వాత కాలంలో ఎలక్షన్కు ఒక్కో కాండేట్ ఇంతే ఖర్చు పెట్టాలి. ఇన్నే వెహికల్స్ వాడాలి అనే ఒక రూల్ను తీసుకొచ్చారు.. దీనికోసం కొందరు డమ్మీ అభ్యర్థులను నిలబెట్టి వాళ్లకు ఉపయోగించిన సదుపాయాలను అసలైన వ్యక్తి వాడుకునేవాడు…

ఇప్పుడే చూస్తే మనకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టం వచ్చింది బటన్ నొక్కడం అనే సిస్టం ద్వారా పాత పద్ధతిలు మారిపోయాయి.. ఇప్పుడు క్యాండిడేట్లో నామినేషన్ వేసే వారి సంఖ్య కూడా తక్కువగానే ఉంది.. ప్రచారం కొత్త పుంతలు తొక్కింది.. సోషల్ మీడియా ట్విట్టర్ ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ దీనిద్వారా ప్రజల్లోకి ప్రతిరోజు నిజాలను అబద్ధాలను వండి వారుస్తూ తీసుకెళ్తున్నారు..

పాంప్లెట్ల స్థానంలో చిన్న చిన్న వీడియోలు వచ్చాయి..యూట్యూబ్ ఛానల్ లు వచ్చాయి..ప్రతి నిమిషానికి ఏం జరుగుతుంది అనేది నిజమో అబద్దమో తెలుసుకోలేకుండా అవసరమే లేకుండా వెంటవెంటనే మనకు చేరవేరుస్తూ ఉంటారు ఇక మనమే డిసైడ్ చేసుకోవాలి అది నిజమా? అబద్దమా? అని..

కాలంలో ఓటింగ్ 40% 50% వేస్తే చాలా ఎక్కువ మరి ఇప్పుడు 75% దాటిపోయింది.. ఆ కాలంలో మహిళలు ఓటింగ్కు తక్కువగా వచ్చేవాళ్ళు.. ఇప్పుడు మహిళలు ఓటింగ్ శాతం చాలా పెరిగింది అందుకనే వాళ్ల మీద చాలా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు.. వృద్ధులు ఒంటరి మహిళలు వితంతువులు అటువంటివారు ఓటింగ్కు వచ్చేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు వాళ్లంతా కచ్చితంగా ఓట్లు వేస్తున్నారు…

ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటు వేయడం అనేది మన హక్కు దానిని వినియోగించుకోవడానికి మనమందరం ముందుకు రావాలి.. ఈ దిశగా మన దేశంలో చాలామంది ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు.. ఈసారి80%, 95% వినియోగించుకున్న ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు..

ఇది శుభ పరిణామమే…

మీరు కూడా స్వేచ్ఛగా మీ ఓటు హక్కును వినియోగించుకోండి.. తప్పకుండా ఓటేయండి.. 5ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ రోజున పండుగలా జరుపుకోండి.. పొద్దున్నే స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని పోయి ఓటు వేసి రండి…

మీతో పాటు మీ ఓటర్ స్లిప్పు, మీ ఓటర్ కార్డ్ లేదా ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళండి సెల్ ఫోన్లు తీసుకెళ్లకండి.. మీరేమంటారు?

డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి MS MCh
గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు, డిప్యూటీ సూపరింటెండెంట్,
ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4