గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
ఓ గర్భిణిని విపత్కర వాతావరణ పరిస్థితుల నడుమ సురక్షిత ప్రదేశానికి తరలించి.. సకాలంలో చికిత్స అందేలా చూసి, ఆమె ప్రాణాలను నిలబెట్టింది. అధికారుల వివరాల ప్రకారం.. జమ్మూ-కశ్మీర్ లోని కుప్వాడా జిల్లాలో నియంత్రణ రేఖ (LoC) వెంబడి మారుమూల పల్లెకు చెందిన ఓ గర్భిణి ఆరోగ్యం విషమించింది. స్థానికంగా వైద్య నిపుణులు అందుబాటులో లేని దుస్థితి.
రోడ్డు మార్గంలో వేరేచోటికి తరలించాలన్నా.. స్థానికంగా భారీగా మంచు కురవడంతో రహదారులన్నీ మూసుకుపోయాయి.
ఈ విషయ తెలుసుకున్న గుగల్దార్ బెటాలియన్ వెంటనే రంగంలోకి దిగింది. జుమాగుండ్లోని ఆర్మీ యూనిట్ నర్సింగ్ అసిస్టెంట్, పీకే గలిలోని బెటాలియన్ వైద్యాధికారి తొలుత ఆమెకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం స్ట్రైచర్పైకి చేర్చి.. గ్రామస్థుల సాయంతో కాలినడకన ఇతర ప్రాంతానికి సురక్షితంగా తరలించారు. ప్రజల నమ్మకాన్ని సైన్యం మరోసారి నిలబెట్టుకుందని అధికారులు తెలిపారు