28
మంచిర్యాల (NEWS): జిల్లాలోని మందమర్రిలో తల్లీ కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. మందమర్రిలో నివాసముంటున్న మురుగన్-ధనలక్ష్మి దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. వీరు చెన్నై నుండి వలస వచ్చారు. ప్రతి రోజు మురుగన్ వ్యాపారం నిమిత్తం బయటకు వెళ్లి సాయంత్రం తిరిగి వస్తాడు. యధావిధిగా అతను బయటకు వెళ్లిన అనంతరం ధనలక్ష్మి, ఆమె కుమార్తె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కుమారుడు ఉదయం లేచి చేసే సరికి అక్క, తల్లి ఆత్మహత్య చేసుకోవడంతో సొమ్మసిల్లి పడిపోయాడు. మందమర్రి సిఐ మహేందర్ రెడ్డి, ఎస్ ఐ చంద్రకుమార్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. వ్యాపర నిమిత్తం ఉదయం వెళ్లిన మురుగన్ ఇంటికి తిరిగి రాకపోవడం.. అతని సెల్ స్విచ్ఛాఫ్ అవ్వడం గమనార్హం.