హైదరాబాద్ : బుధవారము నాడు సంభవించిన అష్టమిని “బుదాష్టమి” అని అంటారు. ఈ బుదాష్టమి శివ పార్వతుల పూజకు మరియు గణపతిని ఆరాధించడం శ్ఱేష్టము. ఎవరైతే ఈ బుధాష్టమి నాడు ఉపవాసముండి, శివారాధన, పార్వతి ఆరాధన చేస్తారో, అట్టి వారు, వారి మరణానంతరం నరకమునకు పోవరట. స్వచ్చమైన పుణ్య జీవితమును పొంది తమ జీవితాన సకాల అభివృద్ధి పొందుతారు. అలాగే బుధవారం రోజున గణపతిని భక్తి శ్రద్ధలతో పూజించి గరికను సమర్పించడం ద్వారా ఉన్నత ఫలితాలను పొందవచ్చునని పండితులు చెబుతున్నారు. గజనాథుడిని దర్శించుకోవడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి.
నవగ్రహాలలో ఒకడైన బుదుడిని ఆరాదించి, ఉపవాసముండి బుదుడికి ప్రత్యేక నైవేద్యమును నివేదించాలి. ఇలా ఆచరించినవారికి బుధ గ్రహ దోషములు నివారింపబడి, బుధ గ్రహ బాధలనుండి విముక్తి లభించును. బుధాష్టమి యొక్క విశిష్టత బ్రహ్మాండ పురాణము నందు వివరింప బడివున్నది. ఈ వ్రతం చేసిన వారికి ప్రస్తుత , పూర్వ , జన్మ పాపముల నుండి విముక్తి లభించును. శివ , పార్వతి ఆరాధన ఈ బుధాష్టమి నాడు చేసిన అంతటి ఫలితం లభించును. ఈ వ్రతమాచరించిన వారికి బుధ గ్రహ దోషములు నివారింపబడి , బుధ గ్రహ బాధలనుండి విముక్తి లభించును.
– సబితా రాజు.డి