గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ వచ్చి విద్యార్థులతో ఫుట్‌బాల్ ఆడారు
ఆట మధ్యలో షూ పాడైతే కేవలం సాక్స్‌తో ఆడిన సీఎం.
విద్యార్థులలో, ఫుట్‌బాల్ హెచ్‌సీయూ క్రీడాకారులలో ఉత్సాహం నింపిన సీఎం
ఫెండ్రీ మ్యాచ్ ఆడి ట్రోఫీని అందించి వెళ్ళిన సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ : పార్లమెంటు ఎన్నికలలో బిజీబిజీగా గడిపిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి గంటపాటు ఎంజాయ్ చేస్తూ విద్యార్థులలో ఉత్సాహం నింపాడు. ఆదివారం ఉదయం గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి ఉదయం 7 గంటలకు చేరుకున్నారు. అక్కడ హెచ్‌సీయూ ఎన్‌ఎస్‌యూఐ నాయకులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. అనంతరం క్యాంపస్‌లోని యోగా సెంటర్ గ్రౌండ్‌కు వారితో సీఎం రేవంత్‌రెడ్డి చేరుకొని అక్కడ జరిగే ఫుట్‌బాల్ మ్యాచ్‌ను తిలకించారు. అనంతరం స్వయంగా గ్రౌండ్‌లోకి దిగి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యారు. అనంతరం క్రీడాకారులతో కలసి ఫుట్‌బాల్ ఆడాడు. ఫుట్‌బాల్ క్రీడాకారుల వలె అందరితో కలివిడిగా ఆటఆడుతూ అందరినీ ఎంజాయ్ చేస్తూ ఆడేలా ఉత్సాహ పరుస్తూ తానూ ఎంజాయ్ చేశారు. కాగా సీఎం రాక తెలిసి గచ్చిబౌలి పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
మధ్యలో షూ ఇబ్బంది పెట్టినా వాటిని వదిలి సాక్స్‌తో ఆడిన సీఎం……
హెచ్‌సీయూ సీఎం రేవంత్‌రెడ్డి విద్యార్థులతో కలిసి షుట్‌బాల్ ఆడుతుండగా ఆయన వేసుకున్న షూ తీవ్ర ఇబ్బంది పెట్టాయి. మ«ధ్యలో కాలు పట్టుకొని కొంత ఇబ్బంది పడుతున్నా పట్టువిడువక మధ్య లో ఆటను వదల కుండా అట్లాగే ఫుట్‌బాల్ ఆడాడు.కానీ కొద్ది సేపటి తర్వాత షూ వదిలేసి సాక్స్‌తోనే రంగంలోకి దిగి ఆడుతూ విద్యార్థుల తో ఫుల్ ఎంజాయ్ చేశారు. కానీ ఎక్కడా ఇబ్బంది పడినట్లు కనపడకుండా ఫుట్‌బాల్ ఆడడం విశేషం. విద్యార్థులు కూడా సాక్షాత్తూ సీఎం వచ్చి తమతో ఆడడం తో వారు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంజాయ్ చేస్తూ ఉత్సాహంగా ఫుట్‌బాల్ ఆడారు.
తుత్తూరు టీమ్– థాచపా టీమ్ ల మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్….
హెచ్‌సీయూ క్యాంపస్‌లోని యోగా సెంటర్ గ్రౌండ్‌లో టీమ్ తుత్తూరు– టీమ్ థాచపా జట్ల మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్‌ను ఆదివారం ఉదయం నిర్వహించారు. మ్యాచ్‌లో పాల్గొనే క్రీడాకారులతో సీఎం రేవంత్‌రెడ్డి కరచాలనం చేసి వారిని పరిచయం చేసుకున్నారు. ఈ మ్యాచ్‌ను కూడా ఎంజాయ్ చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి తిలకించారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ఎంజాయ్ చేశారు.
ఇండియా ‘ఏ’ టీమ్‌కు ఆడిన సీఎం రేవంత్‌రెడ్డి…… సీఎం టీమ్‌యే విన్నర్…
హెచ్‌సీయూలో యోగా సెంటర్ గ్రౌండ్‌లో సీఎం రాకతో ఇండియా–ఏ టీమ్‌తో ఇండియా–బీ టీమ్ ఫెండ్ల్రీ మ్యాచ్ ఆడారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇండియా–ఏ టీమ్ వైపు ఆడుతూ తమ టీమ్‌లోని క్రీడాకారులను ఎంజాయ్ చేస్తూ ఆడేలా ప్రొత్సహిస్తూ ఫుట్‌బాల్ క్రీడాకారుడి తరహాలోనే మ్యాచ్‌లో పాల్గొనడం విశేషం. హోరాహోరీగా మ్యాచ్ సాగినా చివరకు సీఎం ఆడిన టీమ్‌యే విజేతగా నిలిచింది. అనంతరం రెండు జట్ల క్రీడాకారులతో వేర్వేరుగా ఫోటోలు కూడా సీఎం రేవంత్‌రెడ్డి దిగారు. అనంతరం వారికి ట్రోఫీలను కూడా అందించి అందరినీ అభినందించారు. సీఎం వెంబడి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులువేం నరేందర్‌రెడ్డి, హర్కర్ వేణుగోపాల్, రాజ్యసభ సభ్యుడు అనీల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీమ్‌ఖురేషి, శాట్ సీఈఓ వేణుగోపాల్‌రెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ హెచ్‌సీయూ ఇన్‌చార్జీ అజయ్, రాష్ట్ర కార్యదర్శి రచనారెడ్డి, మాజీ అధ్యక్షుడు అమల్, యూనిట్ అధ్యక్షురాలు నేహ, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, నందన్, ఉపాధ్యక్షులు మన్‌పి, మహేష్, సభ్యులు ధీరజ్, ప్రణతి, శ్యాంసన్, లక్ష్మీ నారాయణ, ప్రణవ్, స్వాతి జాన్సీ, ఇతర విద్యార్థులు పాల్గొన్నారు.
ఫుట్‌బాల్ ఆడిన సీఎం రేవంత్‌రెడ్డి.
ఎన్నికల ప్రచారంలో బిజీగా పాల్గొన్న సీఎం ఆటవిడుపుతో గంట సేపు ఎంజాయ్
24