29
విజయవాడ:పూర్తిగా అమలు చేయదగ్గ మేనిఫెస్టోనే తాము రూపొందించామని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… తమ మేనిఫెస్టో అమలుపై ఎవరికైనా సందేహాలుంటే నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అనవసరపు ఖర్చులు తగ్గిస్తామని..ఆదాయాన్ని పెంచుతామన్నారు. అనవసరపు ఖర్చులు తగ్గిచడం ద్వారా సుమారు రూ. 2-3 వేల కోట్లను ఆదా చేయవచ్చని చెప్పుకొచ్చారు. పన్నులు వేయకుండా.. వ్యవస్థలను స్ట్రీమ్ లైన్ చేయడం ద్వారా ఆదాయం పెంచుతామన్నారు. నాన్ ట్యాక్స్, ఓన్ ట్యాక్స్ రెవెన్యూలు పెరిగేలా ఫోకస్ పెడతామన్నారు. తాము ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి.. గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులు ఎక్కువగా వచ్చేలా ప్లాన్ చేసుకుంటామని తెలిపారు.