42
ఫలితాలకు మిగిలింది 5 రోజులే.. పార్టీలు మారిన నేతల్లో ఉత్కంఠ
హైదరాబాద్ :
లోక్ సభ ఎన్నికలు ఫలితాలు గడువు సమీపిస్తుండటంతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజ్ గిరి, వికారాబాద్ జిల్లాల నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ నాటి నుంచి ఎక్కడ నలుగురు కలిసిన మనం గెలుస్తున్నమా? మన అభ్యర్థికి ఎంత మెజారిటీ వస్తుంది? మన పార్టీ హవా ఎలా ఉంది? అనే మాటలు వినబడుతున్నాయి. ఈ ఉత్కంఠ ప్రధానంగా ఎన్నికల ముందు పార్టీలు మారిన నేతల్లో అధికంగా కనబడడం గమనార్హం. ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి