– వేడుకలో పాల్గొన్న మాదాపూర్ ఎస్హెచ్ఓ గడ్డం మల్లేష్
– సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు
– విచారణకు ఆదేశించిన మాదాపూర్ డీసీపీ వినీత్
హైదరాబాద్ : కేబుల్ బ్రిడ్జిపై వాహనాలు నిలిపినా… సెల్ఫీలు దిగినా, ఫుట్ పాత్రెయిలింగ్ , గ్రిల్స్ వద్ద నిలబడి వచ్చి పోయే పాదాచారులకు ఆటకంకం కల్గించినా సెక్షన్ 76 హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 ప్రకారం చర్యలు తీసుకుంటామని మాదాపూర్ డీసీపీ వినీత్ ఏప్రిల్ 16 దేశాలు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు నిబంధనలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. డీసీపీ ఆదేశాలు భేఖాతర్ చేస్తూ కేబుల్ బ్రిడ్జిపై మాదాపూర్ ఎస్హెచ్ఓ గడ్డం మల్లేష్‌తో పాటు మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లు బర్త్ డే వేడుకలు జరుపుకోవడం వివాదాస్పదంగా మారింది. కేక్ కట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిబంధనలు పెట్టి పోలీసులే ఉల్లంఘించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. బర్త్ డే వేడుకలో మాదాపూర్ ఎస్హెచ్ఓ ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ విచారణకు ఆదేశించారు. కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీ దిగడం, ప్రమాదాలకు గురి కావడంతో సైబరాబాద్ పోలీసులు సేఫ్టీలో భాగంగా పలు చర్యలు తీసుకున్నారు. వాహనాలను బ్రిడ్జి మధ్యలో నిలపరాదని, బ్రిడ్జికి రెండు వైపుల ఉన్న ఫుట్‌పాత్ గ్రిల్స్ నిలబడి సెల్ఫీలు తీసుకోవద్దని స్పష్టమైన సైబరాబాద్ ఆదేశాలు జారీ చేశారు. కేబుల్ బ్రిడ్జిపై చోటు చేసుకున్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని మాదాపూర్ ఎస్హెచ్ఓ గడ్డం మల్లేష్ అవగాహన కల్పించడమే కాకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేశారు. వాహనాదారులు, సందర్శకులు సహకరించాలని కోరుతూ కవాతు నిర్వహించారు. ఒక వైపు ప్రజల్లో అవగాహన కల్పించిన ఇన్స్పెక్టర్ మల్లేష్ కేబుల్ బ్రిడ్జి ఫుట్‌పాత్‌పై బర్త్ డే వేడుకలలో పాల్గొడం విమర్శలకు దారి తీసింది. ఇటీవల రాత్రి సమయంలో పటాన్చెరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రవణ్ కేబుల్ బ్రిడ్జి ఫుట్‌పాత్ పై కేక్‌కట్ చేయగా , మాదాపూర్ ఎస్హెచ్ఓ మల్లేష్ ఆయనకు కేక్ తినిపిస్తున్నారు. ఫొటోలు రాజేంద్రనగర్ సీసీఎస్ ఇన్సెక్టర్ సంజయ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మగ్గురు ఒకే బ్యాచ్‌కు చెందిన వారు కావడంతో బర్త్ డే వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటె సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటో ఇప్పటిది కాదని, ఫుట్ పాత్ మీదే ఉన్నామని మాదాపూర్ ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ తెలిపారు.
నిబంధనలకు విరుద్ధంగా కేబుల్ బ్రిడ్జిపై బర్త్ డే వేడుక
కేక్ కట్ చేస్తున్న ఇన్స్పెక్టర్లు
39
previous post