37
దేశానికి మోదీ అవసరం ఉంది: చంద్రబాబు
వారణాసి :
గత పదేళ్లలో మోదీ అద్భుతంగా పనిచేశారని తెలుగుదేశం పార్టీ అధి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మూడోసారి ఆయనే ప్రధాని కానున్నారని చెప్పారు. మోదీ నామినేషన్ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ తో కలిస వెళ్లిన ఆయన వారణాసి ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. నామినేషన్ను ఉద్దేశించి పవిత్ర క్షేత్రంలో ఇదొక చారిత్రక సందర్భమని అన్నారు.
భారత్ కు మోదీ అవసరం ఉందని.. అంతర్జాతీయంగా మన దేశం కీలకంగా మారనుందన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్ డీఎ కూటమికి 400కు పైగా సీట్లు వస్తాయని బాబు చెప్పారు.