28
హైదరాబాద్ (NEWS): రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా ఏప్రిల్ ఒకటి, రెండు తేదీల్లో వడగాల్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర తెలిపింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.