25
ఢిల్లీ, నోయిడాలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో బుధవారం ఆ విద్యాసంస్థలన్నీ మూసివేశారు. ఈ జాబితాలో ఢిల్లీ మయూర్ విహార్‌లోని మదర్ మేరీస్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, DAV పబ్లిక్ స్కూల్, సంస్కృతి స్కూల్, అమిటీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నాయి. ప్రస్తుతం ఆయా స్కూళ్లకు పోలీసులు, బాంబు స్క్వాడ్ చేరుకున్నాయి. మరో వైపు ఆ బెదిరింపు మెయిల్స్ ఎవరు పంపారో పోలీసులు ఆరా తీస్తున్నారు.