39
- లఖ్‌నవూ: స్కూల్‌కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ టీచర్‌ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఆగ్రా, సీగానా గ్రామంలోని ప్రీ-సెకండరీ స్కూల్ టీచర్ గుంజన్ చౌదరి తరచూ పాఠశాలకు ఆలస్యంగా వస్తుండడంపై ప్రిన్సిపల్ ఆమెతో వాదనకు దిగారు. టీచర్ తిరిగి జవాబు ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఊగిపోయిన ప్రిన్సిపల్ ఆ టీచర్‌పై దాడి చేశారు. అంతటితో ఆగకుండా దుస్తులను చింపేందుకు ప్రయత్నించారు. మొదట వారిద్దరిని వారించడానికి ప్రయత్నించిన ప్రిన్సిపల్ డ్రైవర్ సైతం టీచర్‌తో వాగ్వాదానికి దిగాడు.
ఈ ఘటనను పాఠశాలలోని మరో టీచర్ వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్త వైరల్‌గా మారింది. అందులో ఇతర టీచర్లు కూడా ప్రిన్సిపల్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, ఆమె స్థాయికి తగ్గట్టు ప్రవర్తించడం లేదని ఆరోపించారు. ఈ ఘటన అనంతరం ప్రిన్సిపల్ సదరు టీచర్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఇటీవల ఇదేవిధంగా ఉత్తరప్రదేశ్‌లోని ఓ స్కూల్‌లో ఫేషియల్ చేయించుకుంటున్న ప్రధానోపాధ్యాయురాలి వీడియో తీసినందుకు ఓ టీచర్‌ను ప్రిన్సిపల్ తీవ్రంగా కొట్టిన ఘటన చోటుచేసుకుంది..