Home ఆంధ్ర ప్రదేశ్ టిడిపి అధికారంలోకి వస్తే రూ.87వేల 3వందల 12 కోట్లు ఖర్చు చేయాలి.

టిడిపి అధికారంలోకి వస్తే రూ.87వేల 3వందల 12 కోట్లు ఖర్చు చేయాలి.

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు వస్తాయి.

0 comment

జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు వస్తాయి. చంద్రబాబు వస్తే జీతాలు ఎపుడు వస్తాయో చెప్పలేం..త్రైమాసికానికి ఒకసారి జీతాలు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదుజగన్ ప్రభుత్వంలో ప్రస్తుతం సంక్షేమ పధకాల అమలుతో పది రోజుల పాటు ఆలశ్యంగా నైనా ప్రతీ నెల జీతాలు వస్తున్నాయి. అదే చంద్రబాబు సూపర్ సిక్స్ పధకాలను అమలు చేస్తే ఏ నెల జీతాలు ఆ నెలలో రావు. మూడు నెలల కోసారి జీతాలు వస్తాయి. బాబు సూపర్‌ సిక్స్‌ పథకాలను, ఇతర పథకాలను అమలు చేయడానికి రూ. 1లక్షా 40 వేల కోట్లు అవసరం అవుతాయి.

1. 55 లక్షల మంది పింఛన్ల లబ్ధిదారులకు రూ.24 వేల కోట్లు
2. వ్యవసాయానికి అందిస్తున్న ఉచిత విద్యుత్తుకు రూ.11 వేల కోట్లు
3. ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్‌) ద్వారా రేషన్‌ పంపిణీకి రూ.4వేల 6వందల కోట్లు

4. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య సురక్ష, ఆసరా, 104, 108 కింద హెల్త్‌కేర్‌ పథకాలకు రూ. 4వేల 4వందల కోట్లు

5. విద్యా దీవెన, వసతి దీవెన ఫీజు రీయంబర్స్‌మెంట్‌ పధకాలకు రూ. 5వేల కోట్లు

6. సంపూర్ణ పోషణ పథకానికి రూ.2వేల 2వందల కోట్లు

7. గోరు ముద్దకు రూ.1వెయ్యి 9వందల కోట్లు

వెరసి ఈ పథకాల అమలుకు ఏటా సుమారు రూ. 52వేల 7వందల కోట్లు వెచ్చించాలి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ పథకాలను అమలు చేసి తీరాల్సిందే. టిడిపి వచ్చినా వీటిని రద్దు చేయడం కుదరదు. బాబు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాల అమలుకు ఏటా సుమారు రూ.73వేల 4వందల 40 కోట్లు అవసరమవుతాయి. వీటితోపాటు బిసిలకు ప్రకటించిన పెన్షన్‌ కోసం అదనంగా రూ.13వేల 8వందల 72 కోట్లు ఖర్చవుతాయి.

టిడిపి అధికారంలోకి వస్తే వీటన్నిటిని కలిపి, కొత్తగా ప్రకటించిన పథకాలను జోడించి రూ.87వేల 3వందల 12 కోట్లు ఖర్చు చేయాలి.

ప్రస్తుత జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాలి.  కాబట్టి మొత్తం ఏడాదికి రూ.1లక్షా 40వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ మెత్తం ఖర్చు చేయడానికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. పాలనా సంస్కరణలను ప్రవేశ పెట్టి, లంచాలకు తావు లేకుండా చేసి జగన్ ప్రభుత్వం డిబిటి, నాన్‌ డిబిటి ద్వారా రూ.75 వేల కోట్ల ఖర్చుతో సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది.

చంద్రబాబు ప్రకటించిన పథకాలను అమలు చేస్తే ఖర్చు రెండింతలవుతుంది, వీటికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారని, చంద్రబాబుకు పథకాలు అమలు చేయడం సాధ్యం కాదని ఉపాధ్యాయులు ఉద్యోగులు విశ్వసిస్తున్నారు.  చంద్రబాబు అధికారంలోకి వస్తే.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఏ నెలకా నెల కచ్చితంగా జీతాలు చెల్లించి.. తాను ప్రకటించిన పథకాలను అమలు చేయకపోతే మాత్రం చంద్రబాబు ప్రజా ఉద్యమాన్ని ఎదుర్కోక తప్పదు.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4