26
జపాన్‌లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు
జపాన్‌లో ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య రికార్డు స్థాయిలో 90 లక్షలకు చేరింది. దేశంలో వృద్ధుల సంఖ్య పెరగటం.. అదే సమయంలో జననాలు పడిపోవడం దీనికి ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇటువంటి సమస్య ఒక్క జపాన్‌కే పరిమితం కాదని.. అమెరికా, కొన్ని ఐరోపా దేశాల్లో కూడా ఇలాగే ఉంటుందంటున్నారు. జపాన్‌లో 2023లో అంతకుముందు ఏడాది కన్నా జనాభా 8 లక్షలు తగ్గింది. ఈ దేశంలో మొత్తం 12.5 కోట్ల మంది నివాసం ఉంటున్నారు.