64
హైదరాబాద్ : శ్రీలక్ష్మీప్రత్యంగిరదేవి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐశ్వర్యాంబిక తపోవనం(త్రిశక్తి పీఠం) ఆధ్వర్యంలో ఈ వేడుకలను శ్రీ శ్రీ శక్త్యానందగిరి స్వామి నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠం సభ్యులైన దంపతులు పెద్ద సంఖ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన కుద్బుల్లాపూర్ శాసనసభ్యులు వివేకానంద గౌడ్ ప్రత్యంగిరదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలో పలువురు పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ నిర్వాహకులు, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కాగా ఈ వేడుకల్లో భాగంగా గురుదేవులు శ్రీ శక్త్యానందగిరి స్వామిని భక్తిశ్రద్ధలతో ఉచితరీతిన ఘనంగా సత్కరించారు.