Home జాతీయం ఖాళీ సమయాల్లో తీర్పులు రాస్తాం

ఖాళీ సమయాల్లో తీర్పులు రాస్తాం

శని, ఆదివారాలూ మాకు తీరిక ఉండదు

0 comment

ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
దిల్లీ : సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సెలవులు సుదీర్ఘంగా తీసుకుంటారంటూ చేసే విమర్శలపై అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. ‘‘ మేం శని, ఆదివారాలు కూడా సెలవు తీసుకోబోమన్న విషయం విమర్శించేవారికి తెలియదు. ఆ సమయాల్లో మాకు సదస్సులు, ఇతర వృత్తిపరమైన పనులు ఉంటాయి. సెలవుల్లోనే మేం సుదీర్ఘ తీర్పులు రాస్తాం’’ అని బుధవారం పశ్చిమబెంగాల్‌కు సంబంధించిన ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతా ధర్మాసనం వ్యాఖ్యానించింది. సెలవులపై విమర్శించేవారికి న్యాయమూర్తులెలా పనిచేస్తారో తెలియదని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా పేర్కొన్నారు. రోజుకు 50 నుంచి 60 కేసులు చూడటమంటే మాటలు కాదని అన్నారు ‘‘దేశంలోనే ఇది అత్యంత కఠినమైన ఉద్యోగం’’ అని సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వ్యాఖ్యానించారు.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4