Home హైదరాబాద్ కంటోన్మెంట్‌కు కాంగ్రెస్‌ వరాల జల్లు

కంటోన్మెంట్‌కు కాంగ్రెస్‌ వరాల జల్లు

జీహెచ్‌ఎంసీలో విలీనం చేసుకుంటామని హామీ : సీఎం

0 comment

ప్రభుత్వ భూముల్లో పేదలకు పట్టాలిస్తామన్న
కంటోన్మెంట్‌కు ఇందిరమ్మ ఇళ్లు డబుల్‌ : పొంగులేటి
గెలుపే లక్ష్యంగా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు
హైదరాబాద్ :  సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గంపై వరాల జల్లు కురిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సహా మంత్రులు పలు హామీలు ఇస్తున్నారు. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ప్రభుత్వ భూముల్లోని పేదలకు పట్టాలు ఇస్తామంటూ స్వయంగా సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే భూబదలాయింపు ద్వారా ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులకు లైన్‌ క్లియర్‌ చేసిన అంశాన్ని గుర్తు చేస్తున్నారు. మిలటరీ ఆంక్షల నేపథ్యంలో కంటోన్మెంట్‌ వాసులకు తగిన మున్సిపల్‌ సేవలు అందడం లేదని, జీహెచ్‌ఎంసీలో విలీనం ద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సీఎం ప్రకటించారు. తద్వారా కంటోన్మెంట్‌లోనిఇ తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాలు, రోడ్లు ఇలా అన్నింటా జీహెచ్‌ఎంసీలో మాదిరిగానే అభివృద్ధి కొనసాగుతుందని పేర్కొన్నారు. తాజాగా హౌజింగ్‌ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కంటోన్మెంట్‌లో 6,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు.
పట్టాలపైనే పేదల ఆశలు
2014లో అధికారంలోకి వచ్చిన గులాబీ పార్టీ ప్రభుత్వం నగర వ్యాప్తంగా ప్రభుత్వ స్థలాల్లో వెలిసిన నివాసాలకు పట్టాలు ఇస్తామంటూ జీవో నెం. 58 వెలువరిందింది. తదనుగుణంగా నగరంలో వేలాది మందికి పట్టాలు దక్కినప్పటికీ, కంటోన్మెంట్‌లో 90 శాతానికి పైగా ప్రజల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. కారణమేంటంటే ఆయా స్థలాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రక్షణ, పౌర విమానయాన శాఖల ఆధీనంలో ఉన్నాయి. వీరికి పట్టాలు ఇవ్వాలంటే ముందుగా, ఆ స్థలాలను భూబదలాయింపు ప్రక్రియ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలి. ఈ మేరకు గత ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఇదే అంశాన్ని కాంగ్రెస్‌ నేతలు ప్రధాన ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 150 ఎకరాల భూమిని భూబదలాయింపు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గరిష్టంగా మరో 50 ఎకరాలను బదలాయించుకుంటే సుమారు 10వేల మందికి పట్టాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
ప్రయోజనం చేకూరే బస్తీలివే..
కంటోన్మెంట్‌లో భూబదలాయింపు చేపడితే సుమారు 20కి పైగా బస్తీలోని నిరుపేదలకు పట్టాలు దక్కుతాయి. ఈ జాబితాలో ఉన్న బస్తీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
రక్షణ స్థలాల్లోని బస్తీలు:
రక్షణ స్థలాల్లోని చిన్న కమేలా, 108 బజార్, సెంట్రల్‌ బ్యాటరీ, శివనగర్, మడ్‌ఫోర్ట్, నందమూరి నగర్, నెహ్రూ సెంటినరీ కాలనీ, సాయిబాబా హట్స్, అంబేద్కర్‌ నగర్‌ (బొల్లారం) ప్రాంతాల్లోని 16 ఎకరాలు.
ఎయిర్‌పోర్టు భూముల్లోని బస్తీలు:
రసూల్‌పురా పరిధిలోని ఇందిరమ్మ నగర్, చంద్రబాబు నగర్, శివ నగర్, అర్జు¯Œ నగర్, అన్నానగర్, ఈద్గా అంబేద్కర్‌ నగర్, శ్రీలంక బస్తీ, 105 గల్లీ..
రెట్టింపు ఇందిరమ్మ ఇళ్లు..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఏ పథకంలోనైనా కంటోన్మెంట్‌కు వాటా తక్కువే ఉండటం పరిపాటిగా వస్తోంది. గత ప్రభుత్వం సైతం నగర వ్యాప్తంగా మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే కంటోన్మెంట్‌కు తక్కువ సంఖ్యలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కేటాయించింది. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్‌ ఓటర్లును ఆకర్షించేందుకు కాంగ్రెస్‌ నేతలు ఈ సారి కంటోన్మెంట్‌లో రెట్టింపు ఇందిరమ్మ ఇళ్టు కేటాయిస్తామంటున్నారు. నగరంలోని అన్ని నియోజకవర్గాలకు 3500 చొప్పున మాత్రమే ఇందిరమ్మ ఇస్తుండగా, కంటోన్మెంట్‌కు 6,500 ఇళ్లు ఇస్తామని స్వయంగా హౌజింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ప్రకటించారు. కంటోన్మెంట్‌లో 65 శాతం నిరుపేదలు ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబతున్నాయని, ఈ నేపథ్యంలో తాము గృహ నిర్మాణ రంగంలో నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4