25
ఓల ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోలుపై రూ. 20వేల వరకు తగ్గింపు ఇవ్వనుంది. ఇయర్ ఎండ్ ఆఫర్ కింద ఈ డిస్కౌంట్‌ను ఇవ్వనున్నట్లు ప్రముఖ విద్యుత్ స్కూటర్ల తయారీ సంస్త ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించింది. ఓలా ఎస్1 ఎయిర్ (S1 Air) , ఓలా ఎస్1 ఎయర్ ప్రొ (S1 Pro) కొనుగోలుపై రూ. 10 వేల వరకు.. డిస్కౌంట్ అందిస్తుంది. ఓలా ఎస్1 ఎక్స్+పై రూ. 20వేల డిస్కౌంట్ అందించనున్నట్లు సమాచారం. ఈ ఆఫర్ డిసెంబర్ 17 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.