39
- అహ్మదాబాద్ : లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ మంగళవారం ప్రశాంతంగా జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడి ఈ ఉదయం అహ్మదాబాద్‌లోని ఓ పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలోని నిషాన్ హయ్యర్ సెకండరీ పాఠశాలలోని పోలింగ్ బూత్‌లో ప్రధాని ఓటేశారు. ఉదయం 7:30 గంటల తర్వాత ప్రధాని పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా ఆయనకు స్వాగతం పలకగా.. ఇద్దరు నేతలు బూత్‌కు చేరుకున్నారు. గాంధీనగర్ నుంచి పోటీ చేస్తున్న అమిత్ షా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. లోక్‌సభ ఎన్నికల మూడో విడతలో 10 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 93 నియోజకవర్గాల్లో ఈరోజు ఓటింగ్ జరుగుతోంది.