విజయవాడ : భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో అధిక ఉష్ణోగ్రతలతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. భానుడి ప్రతాపంతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఆంధ్ర ప్రదేశ్ వాసులకు కూల్ న్యూస్ అందించింది. ద్రోణి ప్రభావంతో ఈ నెల 7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇప్పటికే ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల, తిరుపతి సహా కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి.
ఇక శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం,విజయనగరం, విశాఖ, అనకాపల్లి, చిత్తూరు, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని వెల్లడించారు. మిగిలిన చోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు.
– సబితా రాజు.డి