29
అమరావతి: ఏపీలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వచ్చేసింది. ఈ నెల 7, 8 తేదీలలో రోడ్ షో, సభలు నిర్వహించనున్నారు. రాజమహేంద్రవరంలో పురందేశ్వరికి మద్దతుగా 7న సాయంత్రం 3.30 గంటలకు వేమగిరిలో సభలో మోదీ ప్రసంగించనున్నారు. సాయంత్రం 5.45 గంటలకు అనకాపల్లి పరిధిలోని రాజుపాలెం సభలో పాల్గొనున్నారు. 8న సాయంత్రం 4.00 గంటలకు పీలేరు సభలో ప్రసంగించనున్నారు. రాత్రి 7.00గంటలకు విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకూ ప్రధాని మోదీ రోడ్‌షో నిర్వహించున్నారు.