ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలి.!
అమరావతి :
ఓటు వేసేందుకు జనం చూపిస్తున్న చొరవ మరచిపోలేనిది. ఉదయం 7.00 గంటలకే పోలింగ్ కేంద్రాల్లో జనం బారులు తీరారు. ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి. భవిష్యత్తును తీర్చిదిద్దేది ఈ ఎన్నికలే అని జనం గుర్తించారు. ఓటు మీ జీవితాన్ని మారుస్తుంది. మీ ఓటు భావితరాల భవిష్యత్తుకు పునాదులు వేస్తుంది. సుపరిపాలనకు మీ ఓటు నాంది పలకాలి. అశ్రద్ధ చేయకుండా మీ ఓటుహక్కు వినియోగించుకోవాలి. విదేశాల నుంచి కూడా ఓటు వేసేందుకు వస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోని తెలుగువారు కూడా ఓటు వేసేందుకు వస్తున్నారు.
మా కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు.. టీడీపీ అధినేత చంద్రబాబు.
పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో దాడులపై ఈసీకి ఫిర్యాదు చేశాం.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే మా కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. రౌడీయిజం, గూండాయిజంతో రెచ్చిపోతే ఊరుకునేది లేదు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, ఈసీ బాధ్యత తీసుకోవాలి.