సామర్థ్యానికి మించి రాక..అడ్మిషన్లు దొరకని పరిస్థితి
ఃఉదయం, సాయంత్రం వేళల్లో క్రీడాకారులతో కిటకిట
స్విమ్మర్లను వేధిస్తున్న మౌలిక సదుపాయాల కొరత
హైదరాబాద్ : విద్యా సంస్థలకు సెలవులు ప్రభుత్వం ప్రకటించింది. చదువుతో పాటు ఈ వేసవి సెలవుల్లో తమ పిల్లలకు ఏదో ఒక క్రీడాంశంలో శిక్షణ ఇప్పించాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ముఖ్యంగా స్విమ్మింగ్ నేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రైవేటు స్విమ్మింగ్ పూల్స్‌లో ఫీజులు భారీగా ఉండటం, నిర్వహాణ కూడా అధ్వనంగా ఉండటంతో సరూర్‌నగర్ స్టేడియంలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్విమ్మింగ్‌పూల్‌కు చిన్నారులు పోటెత్తుతున్నారు. సామర్థ్యానికి మించి పిల్లలు వస్తుండటంతో నిర్వహాకులు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేయాల్సి వస్తుంది. ఈత నేర్చుకోవాలని ఎంతో ఆశతో వచ్చిన వారికి అడ్మిషన్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంది.
ఇతర క్రీడాంశాల్లోనూ శిక్షణ షురూ!
స్విమ్మింగ్‌తో పాటు ఇతర క్రీడాంశాల్లోనూ శిక్షణ ఇస్తున్నారు. ప్రతి రోజు ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల వరకు, సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. బ్యా డ్మెంటెన్, టేబుల్ టెన్నిస్, వాలిబాల్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, ఆర్చరీ, క్రికెట్, రన్నింగ్, స్కేటింగ్, జిమ్నాస్టిక్, కరాటే, ఖబడ్డి, కోకో, స్విమ్మింగ్ వంటి క్రీడాంశాల్లో నామమాత్రపు ఫీ జుతో శిక్షణ ఇస్తున్నారు. స్టేడియంలో పదిమంది వరకు రెగ్యులర్ కోచ్‌లు ఉన్నారు. విశాలమైన క్రీడామైదానంతో పాటు అనుభవం ఉన్న కోచ్‌లు ఇక్కడ ఉండటంతో మెజార్టీ తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడికే పంపుతుంటారు. అయితే విద్యార్థుల నిష్పత్తి మేరకు కోచ్‌లు లేకపోవడ ంతో అధికారులు జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను కోచ్‌ల ుగా ఎంపిక చేసి, వారికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ సమ్మర్ క్యాంపులు కేవలం విద్యార్థులకే కాదు ప్రైవేటు కోచ్‌లకు ఉపాధి అవకాశంగా మారాయి.
చేకూరే ప్రయోజనాలు ఇవేః
= స్విమ్మింగ్ సహా ఇతర క్రీడాంశాలు శారీరక ధృడత్వానికే కాదు మానసికోల్లాసానికి పాటుపడుతాయి. =విద్యార్థుల మధ్య స్నేహ భావాన్ని,ఐక్యతా భావాన్ని పెంపొందిస్తాయి.
=నాయకత్వ లక్షణాలు అలవడుతాయి. ఆటలు శరీరంలోని కొవ్వు కరిగిస్తాయి.
=పిల్లలు ఊబకాయం బారినపడకుండా చూస్తుంది.
=రక్త ప్రసరణతో పాటు గుండెపని తీరు మెరుగుపడుతుంది.
= మధుమేహం, రక్తపోటు వంటి సమస్య లను దరి చేరనివ్వదు.
= ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గట్టిగా శ్వాస తీసుకుని వదలడం వల్ల శ్వా స నాళాలు బలపడుతాయి.
= కండరాలు, ఎముకలు గట్టిపడుతాయి.
= మెదడు కూడా చురుగ్గా పని చేస్తుంది.
– సబితా రాజు . డి