Home ఆంధ్ర ప్రదేశ్ ఇవి సామాజిక కాలనీలు

ఇవి సామాజిక కాలనీలు

ఫీల్డ్‌ నోట్స్‌ ఆఫ్‌ ఏపీ.

0 comment

1, ఊరిచివర ఉండే పేదల కాలనీ ఊరి మధ్యకు ఎలా వచ్చింది?
‘‘ కూలీ పనుల మీద బతికే వాళ్లం. జీవితాంతం అద్దెల్లు లోనే ఉండిపోతామనుకున్నాం. సొంతిల్లు సమకూర్చుకుంటామని కలలో కూడా ఊహించలేదు. ఇపుడు ఖరీదైన ఏరియాలో హైవే పక్కనే జగనన్న కాలనీలో మాకు సొంతిల్లు వచ్చింది.’’ అని సంతోషంగా చెప్పింది.. ఇమ్రానా బేగం.
ఒకపుడు పేదల కాలనీలు అంటే ఊరవతల ఎలాంటి సదుపాయాలు లేని చోట అప్పటి ప్రభుత్వాలు ఏర్పాటు చేసేవి. దానికి భిన్నంగా ఇపుడు ఊరవతల ఉండాల్సిన పేదల కాలనీలను ఊరిమధ్యకు తెచ్చారు ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌ .
దానికి ప్రత్యక్ష ఉదాహరణ కర్నూల్‌ సమీపంలో హైవే పక్కనే ఉన్న జగనన్న కాలనీ. ఇక్కడ 266 మంది లబ్దిదారులకు ఇంటిస్ధలాలు ఇచ్చి సొంత గృహాలు ఏర్పాటు చేశారు.
గూడు లేని పేదలందరికీ సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జగనన్న కాలనీల నిర్మాణం మొదలు పెట్టింది.
‘‘ గతంలో వేరే చోట అద్దెకు ఉండేవాళ్లం. అక్కడ చాలా సమస్యలు ఎదొర్కొన్నాం. కరెంట్‌ ,తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉండేవి. ఇపుడు ఈ కాలనీలో సొంతిల్లు వచ్చింది చాలా సంతోషంగా ఉన్నాం. అన్ని కులాలు,మతాల వారు ఒకే చోట సామరస్యంగా ఉంటున్నాం. కొందరు అద్దెకు కూడా ఇచ్చుకుంటున్నారు. 5 నుండి 10వేలు వస్తున్నాయి. ’’ అన్నారు ఇదే కాలనీ నివాసి సుధాకర్‌.

విలువ పెరిగే స్ధిరాస్తి!
‘‘ సెంటున్నర స్ధలంలో ఇల్లు ఏంటీ అని అనేక మంది విమర్శించారు. ఈ కాలనీలో నిర్మించిన ఇల్లు చూస్తే సాధ్యమే అని అర్ధం అవుతుంది. లబ్బిదారులంతా సంతోషంగా ఉన్నారు. కాలనీలో కొన్ని ఇండ్లు పూర్తి కావాల్సి ఉంది. హైవే పక్కనే ఈ కాలనీ ఉండటం వల్ల ఈ ఇళ్లకు మార్కెట్‌ విలువ కూడా పెరుగుతుంది. ఉపాధి హామీ పథకంలో ఈ కాలనీకి సిపి రోడ్లు , డ్రైనేజీ సదుపాయాలు కల్పిస్తున్నాం ’’ అన్నారు, కర్నూల్‌, డ్వామా ఏపిఓ లక్ష్మన్న.

కర్నూల్‌ నుండి నంద్యాల వెళ్లేదారిలో హైవే పక్కనే, ఓర్వకల్లు లో నిర్మాణం పూర్తి చేసుకుంటోంది జగనన్న కాలనీ.
…………
లబ్ధిదారులకు 3 అప్షన్లు!
రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలు ఉండకూడనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మొత్తం రూ.28,084 కోట్లతో మొదటి దశలో 15.60 లక్షల పక్కా గృహాల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే రెండో దశలో రూ. 22,860 కోట్లతో మరో 12.70 లక్షల గృహాల నిర్మాణం చేయబోతున్నారు. కొత్తగా అర్హులు చేరినా, వారికి కూడా ఇల్లు ఇస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని ఏపీ ప్రభుత్వం అధికారులు అంటున్నారు.
జగనన్న కాలనీలో నిర్మించే ఇళ్లు విస్తీర్ణం 340 చదరపు అడుగులు. ప్రతి ఇంటికి రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్‌ లైట్లు, నాలుగు బల్బులు, ఒక వాటర్‌ ట్యాంక్‌ ఉంటాయి.
ఈ పథకంలో లబ్ధిదారులకు ప్రభుత్వం మూడు అప్షన్లను ఇచ్చింది.
1, లబ్దిదారుడే స్వయంగా ఇల్లు నిర్మించుకోవడం, దీనికి అయ్యే ఖర్చును ప్రభుత్వం ఇస్తుంది.
2, ఇంటి నిర్మాణం మెటీరియల్‌కు అయ్యే ఖర్చును ప్రభుత్వం సబ్సిడీతో అందించడం,
3, ప్రభుత్వమే పూర్తిగా ఇల్లు కట్టి ఇవ్వడం.
ఈ మూడు అప్షన్లలో దేనిని ఎంచుకున్నా, ప్రభుత్వం నుండి లక్షా 80వేల రూపాయిల సాయం లబ్ధిదారుడికి అందుతుంది.
ఎలాంటి అర్హతలు ఉండాలి?
1, తెల్ల రేషన్‌ కార్డు ఉండి సొంత స్ధలం ఉండకూడదు.
2, జగనన్నకాలనీలో ఇల్లు నిర్మించుకునే వారికి రూ. 1,59,750లతో పాటు 20 వేల విలువైన 90 బస్తాల సిమెంట్‌ లభిస్తుంది.
3, మొత్తం రూ. 1, 80,000 లబ్ధిదారుడికి అందుతుంది.
4, ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 17000 కాలనీలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉంది. తొలి వెంచర్‌లో 8,905 లేఅవుట్లలో 11.26 లక్షల ఇళ్లను నిర్మించబోతుంది. సమస్యలున్నాయి!
సామాజిక కోణంలో అందరికీ నీడను ఇచ్చే వైఎస్సార్‌ జగనన్న కాలనీల కాన్సెప్ట్‌ బాగున్నప్పటికీ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయన మా ఫీల్డ్‌ విజిట్‌లో గుర్తించాం.
ఓర్వకల్లు జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ కొన్ని చోట్ల తాగునీరు లేదు. పైప్‌ లైన్‌ వేసినప్పటికీ ఇంకా వాటర్‌ సరఫరా ఇవ్వలేదు. డ్రైనేజీ నీరు పోయే దారి లేక రోడ్లమీద నిలువ ఉంటుంది. దాని వల్ల దోమలు పెరుగుతున్నాయని కాలనీ వాసులు మా దృష్టికి తెచ్చారు.
అధికారుల స్పందన ఏమిటి?
‘‘ ఓర్వకల్లు రాతి ప్రదేశం అవ్వడం వల్ల ఈ కాలనీలో కొన్ని సమస్యలున్నాయి. ఇంకా కాలనీ పూర్తిస్ధాయిలో నిర్మాణం కాలేదు. కాలనీ పూర్తి కాగానే ఈ సమస్యలన్నీ త్వరలో ప్రభుత్వం పరిష్కరిస్తుంది. ’’ అని, కర్నూల్‌ డ్వామాప్రాజెక్ట్‌ డైరెక్టర్‌,అమరనాధ్‌ రెడ్డి చెప్పారు.
అయితే ఒకటి మాత్రం వాస్తవం. కాలనీ సందర్శించాక అందరూ సంతోషంగా వ్యక్తం చేసిన అభిప్రాయం ఇది.
‘‘ మాకు గతంలో వేరేగా కాలనీలు ఉండేవి. అవమానంగా ఫీల్‌ అయ్యేవాళ్లం ఇపుడలా కాదు అన్ని మతాలు వర్గాలు ఒకే చోట కలిసి మెలసి ఉంటున్నాం. ఇవి సామాజిక కాలనీలు!’’
.. శ్యాంమోహన్‌(రూరల్‌ మీడియా)

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4