Home తెలంగాణ ఇక్కడి ఎంపీలు ప్రధానులుగా, ముఖ్యమంత్రులుగా

ఇక్కడి ఎంపీలు ప్రధానులుగా, ముఖ్యమంత్రులుగా

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం

0 comment

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన వారిలో ఇద్దరు భారతదేశానికి ప్రధానులుగా సేవలందించారు. 1980 పార్లమెంట్‌ ఎన్నికల్లో మెదక్‌ ఎంపీగా ఇందిరాగాంధీ గెలిచారు. ప్రధాని అయ్యాక 1996లో నంద్యాల నుంచి పీవీ.నరసింహారావు ఎంపీగా గెలిచారు. కడప ఎంపీలుగాగెలిచినతండ్రీకొడుకువైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి,జగన్‌మోహన్‌రెడ్డిలకుసీఎంలుగాపనిచేసేఅరుదైనఅవకాశందక్కింది.ఖమ్మంనుంచిగెలిచిననాదెండ్లభాస్కర్‌రావు,జలగంవెంగళరావులుకూడాసీఎంలుగాపనిచేసినవారే.నర్సారావుపేటఎంపీలుగాప్రాతినిధ్యంవహించినబెజవాడగోపాల్‌రెడ్డి,నేదురమల్లిజనార్దన్‌రెడ్డిలుకూడాసీఎంలుగాపనిచేశారు.నాటి సార్వత్రిక ఎన్నికలనుంచిఇప్పటివరకుఆయాపార్లమెంట్‌సెగ్మెంట్‌లలోగెలిచినవారుఉమ్మడిఆంధ్రప్రదేశ్‌లోనూ,ఆతర్వాతతెలంగాణలోనూ,ఆంధ్రప్రదేశ్‌లోనూఎవరెవరుఉన్నారోతెలుసుకుందాం.

– 1957 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచన వారెవరూ తర్వాతి కాలంలో కూడా సీఎంలుగా పనిచేయలేదు.
……
1962 లోక్‌సభ :
కావలి నుంచి బెజవాడ గోపాల్‌రెడ్డి ఎంపీగా గెలిచారు. ఈయన 1955 నుంచి 1956 వరకు సీఎంగా పనిచేశారు. అప్పుడు హైదరాబాద్‌ స్టేట్, ఆంధ్రప్రదేశ్‌లు కలిసి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఇంకా ఏర్పడలేదు.
………………………
1967 , 1971 లోక్‌సభ :
– సీఎంలు పనిచేసినవారిలో ఎవరూ ఈ ఎన్నికల్లో ఎంపీలుగా ఎన్నిక కాలేదు.
..
1977 లోక్‌సభ :
కాసు బ్రహ్మానందరెడ్డి నర్సారావుపేట నుంచి, పీవీ.నరసింహారావు హనుమకొండ నుంచి, కర్నూలు నుంచి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఎంపీలుగా గెలిచారు. 1964 నుంచి 1971 వరకు వరుసగా రెండుసార్లు దాదాపు ఏడేళ్లపాటు ఉమ్మడి ఏపీకి సీఎంగా పనిచేశారు.
…….
1980 లోక్‌సభ :
హనుమకొండ నుంచి పీవీ.నరసింహారావు, కర్నూలు నుంచి కోట్ల విజయభాస్కర్‌రెడ్డిలు ఎంపీలుగా గెలిచారు. పీవీ 1971 నుంచి 1973 వరకు ఉమ్మడి ఎంపీ సీఎంగా పనిచేశారు. తర్వాతి కాలంలో ఈయన 1996లో నంద్యాల నుంచి ఎంపీగా కూడా గెలిచారు. ప్రధాని అయ్యాక.. ఉప ఎన్నిక ద్వారా ఇక్కడి నుంచి ఎన్నికయ్యారు.
…….

1984 లోక్‌సభ
ఖమ్మం నుంచి జలగం వెంగళరావు ఎంపీగా గెలిచారు. జలగం ఉమ్మడిఏపీకి 1973 నుంచి 1978 వరకు సీఎంగా పనిచేశారు.
….

1989 లోక్‌సభ :
– ఖమ్మం నుంచి జలగం వెంగళరావు, కడప నుంచి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డిలు ఎంపీలుగా గెలిచారు.
…..

1991 లోక్‌సభ :
– కర్నూలు నుంచి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, కడప నుంచి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి గెలిచారు.
….
1996 లోక్‌సభ :
– కర్నూలు నుంచి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, కడప నుంచి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి గెలిచారు.
..
1998 లోక్‌సభ :
1998 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నికైన ఐదుగురు లోక్‌సభ సభ్యుల్లో ఐదుగురు ముఖ్యమంత్రులు ఉన్నారు. వీరిలో అంతకుముందే ముగ్గురు సీఎంలుగా, ఆ తర్వాత వైఎస్, రోశయ్యలకు ముఖ్యమంత్రులుగా అవకాశం వచ్చింది. విశేషమేమిటంటే వీరంతా కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన వారే.
1. కర్నూలు – కోట్ల విజయభాస్కర్‌రెడ్డి
( ఈయన ఉమ్మడి ఏపీకి 1982 నుంచి 1983 వరకు ఒకసారి, 1992 నుంచి 1994 వరకు మరోసారి ముఖ్యమంత్రి పనిచేశారు. మరో విశేషమేమిటంటే రెండుసార్లూ కోట్ల తర్వాత ఎన్‌టీఆర్‌ సీఎం అయ్యారు.
2. ఖమ్మం – నాదెండ్ల భాస్కర్‌రావు
(1984లో ఈయన కేవలం 31రోజులు మాత్రమే సీఎంగా ఉన్నారు.)
3. బాపట్ల– నేదురుపల్లి జనార్దన్‌రెడ్డి
(1990 నుంచి 92 వరకు సీఎంగా ఉన్నారు.)
4. కడప– వైఎస్‌.రాజశేఖరరెడ్డి
(2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చి సీఎంగా పనిచేశారు. 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రెండోసారి పదవిలో ఉండగానే విమాన ప్రమాదంలో చనిపోయారు.)
5. నర్సారావుపేట – కొణిజేటి రోశయ్య
(వైఎస్‌.రాజశేఖరరెడ్డి చనిపోయాక ఈయనకు సీఎంగా అవకాశం వచ్చింది. 2009 నుంచి 2010 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
……………..
1999 లోక్‌సభ :
–నర్సారావుపేట నుంచి నేదురుపలి మరోమారుఎంపీగా ఎన్నికయ్యారు.
……
2004 లోక్‌సభ
– కరీంనగర్‌ నుంచి కేసీఆర్‌ ఎంపీగా గెలిచారు. తర్వాతి కాలంలో ఆయన 2014, 2019 అసెంబ్లీలో వరుసగా రెండుసార్లు తెలంగాణకు సీఎంగా పనిచేశారు.
…..
2009 లోక్‌సభ
2009 లోక్‌సభ కడప నుంచి ఎంపీగా గెలిచిన వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర విభజన జరిగాక 2019లో ఆంధ్రప్రదేశ్‌ సీఎం అయ్యారు.
– ఈ లోక్‌సభ ఎన్నికల్లోనే మహబూబ్‌నగర్‌ నుంచి కేసీఆర్‌ ఎంపీగా గెలిచారు.
– సబితా రాజు.డి

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4