హైదరాబాద్: మే 9 తేదీ నుంచి జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు తొలి దశ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఈ మేరకు ఇంటర్ బోర్డు బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది.
9 నుంచి మే 31వ తేదీ వరకు దరఖాస్తులను తెలంగాణలోని ఆయా ఇంటర్ కాలేజీల్లో స్వీకరించనున్నారు. జూన్ 1వ తేదీ నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం కానున్నాయి.
జూన్ 30వ తేదీ లోపు తొలి దశ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయనున్నారు.ఇక ఇంటర్ లో ప్రవేశం తీసుకోవాలను కునే విద్యార్థులు ఇంటర్నెట్ మార్క్స్ మెమో, ఆధార్ కార్డు తప్పనిసరిగా దరఖా స్తుకు జతపరచాలి.
ప్రొవిజినల్ అడ్మిషన్ పూర్త యిన తర్వాత కచ్చితంగా ఒరిజినల్ మెమోతో పాటు టీసీ సమర్పించాల్సి ఉంటుంది. పదో తరగతిలో వచ్చిన జీపీఏ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రవేశాల కోసం ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకూడ దని ఆయా కాలేజీలకు ఇంటర్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది…