37
హైదరాబాద్: అనుమానాస్పద బ్యాంకు ఖాతాలపై ఆర్బీఐ కొరడా జులిపించింది. అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) దృష్టి పెట్టింది. అనుమానాస్పద ఖాతాలను వెంటనే స్తంభింపజేయాలంటూ అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. దాంతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల్లో ఈ తరహా ఖాతాల రద్దు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. మూడు నెలల కాలంలోనే దాదాపు 2.5 లక్షల ఖాతాలు రద్దయ్యాయి.